Keedaa Cola: కీడా కోలా మూవీలో బ్రహ్మనందం క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
హాస్య బ్రహ్మ బ్రహ్మనందం, చైతన్య రావు మదాడి, తరుణ్ భాస్కర్, రఘురామ్, రాగ్ మయూర్, జీవన్, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. ఇక ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. ఇక డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి టాక్ రావడంతో.. వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మనందం రోల్ ను మొదట ఓ స్టార్ ప్రోడ్యూసర్ ఆఫర్ చేశారు. అసలు ఆయన ఎవరు.. ఎందుకు చేయలేదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ దర్శకుడు స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'కీడా కోలా'. ఈ చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

కీడా కోలా సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినినామను ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఇండియాలో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినా నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది.

అసలు విషయం ఏంటంటే.. కీడా కోలా సినిమాలో బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన పాత్రకు స్టార్ ప్రొడ్యూసర్ ను అనుకున్నారట. ఆయన ఎవరో కాదు.. అల్లు అరవింద్. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అనుకున్నడాు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు.

కీడా కోలా స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ మొదట అనుకున్నాడట. ఆ మధ్య ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకువచ్చారు. రానాతో ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్‌గా నవ్వి రిజెక్ట్ చేశారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మనందం చేశారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. డిఫరెంట్ జోనర్ 'కీడా కోలా' ను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ఫన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మనందం క్యారెక్టర్ కు మంచి ఆదరణ వస్తుంది. ఇక అల్లు అరవింద్ రిజెక్ట్ చేయడం మంచిదే నని కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











