ప్రపంచంలోనే అత్యంత ధనిక యాక్టర్ ఎవరో తెలుసా? షారుక్, టామ్ క్రూజ్ తలదన్నే సంపద.. ఆ హీరో ఎవరంటే?
ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న హీరోల జాబితాలో షారుక్ ఖాన్, జానీ డెప్, డ్వెయిన్ జాన్సన్ లాంటి ఉన్న విషయం తెలిసిందే. తాజా ఫోర్డ్స్ జాబితాలో ఈ అగ్ర హీరోలను తలదన్నేలా ఎవరికి తెలియని నటుడు దూసుకొచ్చాడు. అతడే టైలర్ పెర్రీ. షారుక్, హాలీవుడ్ స్టార్లను మించి సంపాదించిన టైలర్ పెర్రీ ఎవరు? అతడి ఆస్తులు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఫోర్డ్స్ జాబితాలో అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుక్ ఖాన్ (6000 కోట్లు) టాప్ స్థానంలో గతంలో కొనసాగారు. ఆయన తర్వాత స్థానంలో టామ్ క్రూయిజ్, డ్వేన్ జాన్సన్, జాకీ చాన్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డీ నీరో, అర్నాల్డ్ స్కావర్జెనెగర్ నిలిచారు. అయితే ప్రస్తుతం ఈ హీరోల సంపదను మించి టైలర్ పెర్నీ టాప్ స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన యాక్టర్ జాబితాలో నిలిచిన టైలర్ పెర్రీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. పూర్తిస్థాయి నటుడు కాదు. ఆయన మాబెల్ మాడియా సిమన్స్ అనే క్యారెక్టర్ సృష్టికర్త. దర్శకుడిగా పాపులారిటీ సాధించాడు. ఈ క్యారెక్టర్‌తో 12 సినిమాల్లో నటించడమే కాకుండా అందర్నీ మెప్పించాడు.
టైలర్ పెర్నీ అత్యంత ధనవంతుడు కావడానికి దోహదపడిన సిరీస్ ది హేవ్స్, ది హావ్స్ నాట్స్. ఈ సిరీస్ విజయవంతం కావడంతో అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 1 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో 8200 కోట్ల రూపాయలు. 53 ఏళ్ల వయసులో అత్యంత ధనిక నటుడిగా పేరు తెచ్చుకొన్నారు.

నటుడిగా టైలర్ పెర్నీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. దర్శకుడి, నిర్మాతగా మంచి పాపులారిటీని సంపాదంచాడు. నటుడిగా అతిథి పాత్రల్లో స్టార్ ట్రెక్, గాన్ వైరల్, వైస్, పావ్ పెట్రోల్ చిత్రాల్లో నటించాడు. కేవలం ఒకట్రెండు సిరీస్‌లను రూపొందించి ప్రపంచంలోనే అత్యధిక ధనికుల జాబితాలో చేరారు.
టేలర్ పెర్రీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 13, 1969లో అమెరికాలోని లూసియానాలో జన్మించాడు. డైరీ ఆఫ్ ఏ మ్యాడ్ బ్లాక్ ఉమెన్ చిత్రంతో నటుడిగా, నిర్మాతగా, ప్లే రైటర్‌గా సినీ రంగంలోకి ప్రవేశించారు. దాదాపు 40 చిత్రాలతో భాగస్వామ్యం పంచుకొన్నారు. పలు టెలివిజన్ షోల పనిచేశారు.


Click it and Unblock the Notifications











