సల్మాన్ సోదరికి షారుక్ ఖాన్ ఏం గిఫ్టు ఇచ్చాడో తెలుసా?
హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇటీవల సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడంటే సల్మాన్, షారుక్ మధ్య కాస్త దూరం పెరిగింది కానీ ఒకప్పుడు ఇద్దరూ చాలా సన్నిహితులు. సల్మాన్ ఫ్యామిలీకి కూడా షారుక్ చాలా సన్నిహితంగా ఉండే వాడు. అప్పటి నుండి చెల్లి అర్పితతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది.
చెల్లి పెళ్లికి షారుక్ ఖాన్ కూడా హాజరయ్యాడు. ఇటీవల షారుక్, సల్మాన్ చెల్లి అర్పితను అప్యాయంగా ముద్దాడిన ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.....షారుక్ అర్పితకు పెళ్లి కానుకగా ఏమిఇచ్చాడు? అనేది హాట్ టాపిక్ అయింది. షారుక్ ఖాన్ తన రేంజికి తగిన విధంగా గిఫ్టు అందించాడట. అర్పిత ఇష్టా ఇష్టాలు ముందే తెలిసిన షారుక్....ఆమె కోసం స్పెషల్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ హ్యాంపర్ గిఫ్టుగా అందించారట.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పిత ఖాన్ వివాహం మంగళవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్ శర్మతో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వివాహానికి విచ్చేసిన అతిథుల కోసం హైదరాబాద్ స్పెషల్ వంటకాలు, ఉత్తరాది వంటలు చేయించారు. బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరు కావడంతో కన్నుల విందుగా వివాహం జరిగింది. అమీర్‌ఖాన్ దంపతులు, కత్రినా కైఫ్, రితేష్ దేశ్‌ముఖ్, కరణ్ జోహార్, డేవిడ్ ధావన్, సుభాష్ ఘయ్, ప్రియాంక చోప్రా, మికాసింగ్, బాబా సెహగల్, వరుణ్ ధావన్, రాణీ ముఖర్జీ, జరీన్ ఖాన్, రణబీర్ కపూర్ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ నుండి ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు, టాలీవుడ్ ప్రముఖులు వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, రామ్‌చరణ్ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











