Salaar: సలార్ సినిమాలో పృథ్విరాజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఇక ఈ సినిమాకు కేజీఎప్ సిరీస్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న థియేటర్లోకి రానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటించే ఛాన్సును మిస్ చేసుకున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బహుబలి సిరీస్ తో ఒక్కసారిగా క్రేజ్ కొట్టేసిన ప్రభాస్.. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. బహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో నటించిన ప్రభాస్... ఆ సినిమాలు బహుబలి రేంజులో అలరించలేకపోయాయి. ఇక ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే చిత్రంతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Do you know which Tollywood hero missed Prithviraj Sukumarans role in Prabhas Salaar?

ఇప్పటికే రీలజ్ చేసిన ట్రైలర్స్, సూరీడు పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కు ఒక సాలిడ్ హిట్ పడితే... చూడాలని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారి ఆకలి ఈ సలార్ సినిమాతో తీరనుందని అంటున్నారు. ఇక ప్రభాస్ సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి. ఊహించని రేంజులో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది.

సలార్ సినిమా దెబ్బకు ఏకంగా బుక్ మై షో యాప్ క్రాష్ అయ్యిందని సమాచారం. గంటకి 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన సలార్ సినిమా.. ఇప్పటివరకు 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయని అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా ఇతర భాషల్లో కూడా ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

Do you know which Tollywood hero missed Prithviraj Sukumarans role in Prabhas Salaar?

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకమారన్ నటించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు సమానంగా ఆయన క్యారెక్టర్ ఉండనుందని ఇప్పటికే ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తన బెస్ట్ క్యారెక్టర్ ఇదే అంటూ కూడా పృథ్వీరాజ్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు. ఇక రిలీజ్ అయిన సూరీడు పాట, ట్రైలర్స్ చూస్తుంటే.. పృథ్విరాజ్ క్యారెక్టర్ నెక్ట్ లెవెల్ అని తెలుస్తోంది.

అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదట ఈ పాత్రని టాలీవుడ్ హీరో గోపించంద్ తో చేయించాలని మేకర్స్ అనుకున్నారట. కానీ గోపీచంద్ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఇలాంటి పాత్రలు చేస్తే తన కెరియర్ ఇబ్బందవుతుందని ప్రభాస్ భావించారట. గోపీచంద్ కి హీరోగా నటించే అవకాశాలు తగ్గిపోతాయని ఈ పాత్రని వేరే ఎవరికైనా ఇవ్వమని సలహా ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తన స్నేహితుడి కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా మరో హీరోకి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ నెట్టింట్ వైరల్ గా కాగా.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X