Balakrishna Heroines: రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బాలయ్య బాబు హీరోయిన్లు ఎవరో తెలుసా?
బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నందమూరి ఎన్టీ రామారావు వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన పక్కన నటించిన హీరోయిన్లు.. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వాళ్లు ఎవరు.. ప్రస్తుతం ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకుందాం.
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టి ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఆయన నందమూరి వారసుడిగా కాకుండా.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ... బాలయ్య బాబు బాగా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయనతో నటించిన పలు హీరోయిన్స్ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు వారిలో కొంతమంది హీరోయిన్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉంటారు. ఒకప్పుడు బాలయ్య బాబుతో నటించి ఇప్పుడు రాజకీయాల్లో స్థిరపడ్డారు. ఇక మొదటగా.. బాలయ్య బాబుతో నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టిన హీరోయిన్ విజయ శాంతి.

విజయశాంతి మెదక్ నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక మహారధి సినిమాలో నటించిన నవనీత్ కౌర్ ప్రస్తుత మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర్య ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్యకు కొన్ని సినిమాలలో విలన్ గా నటించినా దివంగత రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ ఇద్దరు ఎంపీలుగా గెలిచారు.
కైకల మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిస్తే... రావుగోపాలరావు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక మరో సీనియర్ నటీమణి శారద కూడా తెనాలి నుంచి ఒకసారి టిడిపి తరఫున ఎంపీగా గెలిచారు. బాలయ్యతో కలిసి కొన్ని సినిమాలలో నటించిన జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్...తే జయప్రద యూపీలోని రామ్ పూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.

అలాగే హీరోయిన్ నగ్మా కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయి.. చక్రం తిప్పుతుంది. ఇక బాలయ్యకు మరో హిట్ హీరోయిన్ ఆర్కే రోజా కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా బాలయ్యతో నటించిన వారు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతున్నారు. ఇక మున్ముందు ఏ హీరోయిన్స్ రాజకీయాల్లోకి రానున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











