Who is Jitender Reddy? భగత్ సింగ్, అల్లూరి త్యాగాల దారిలో.. దేశం కోసం అమరుడిగా.. ఎవరీ జితేందర్ రెడ్డి!
కంటెంట్ ఉన్న జీవిత చరిత్రలకు ప్రేక్షకులు ఆమోద ముద్ర, ఆదరణ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని పలు బయోపిక్స్ రుజువు చేశాయి. ప్రజలతో మమేకమైన వ్యక్తుల జీవితాలకు మరో కోణం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చరిత్రలో మరుగునపడిపోయే వ్యక్తుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించిన సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.
అలాంటి కోవలో వస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవల మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఎవరు? అతడి బయోపిక్ గురించిన విశేషాలు ఏమిటి? ఈ బయోపిక్ రూపొందించడం వెనుక ఉన్న కారణాల వివరాల్లోకి వెళితే..

జితేందర్ రెడ్డి విషయానికి వస్తే.. జగిత్యాలకు చెందిన అభ్యుదయ భావాలు ఉన్న యువకుడు. 80వ దశకంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ సంస్థలకు అనుబంధంగా సేవలు అందించారు. ఆ సమయంలో సంఘ విద్రోహశక్తులు, నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేశాడు. ఆ పోరాటంలో భాగంగానే భారతమాత ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు.
అలాంటి భారతమాత ముద్దు బిడ్డ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ ఎమోషనల్ బయోపిక్‌ను రూపొందించారు.ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇటీవల కాలంలో తనకు తాను,చ తన ప్రతిభను నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో రాకేశ్ వర్రే టైటిల్ పాత్రలో నటించారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ తర్వాత ప్రతీ ఒక్కరికి అతడి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుంది. సమాజానికి ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం అలాంటి ఒక నిజాన్ని జితేందర్ రెడ్డి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే అని నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు.
గతంలో నేను ప్రేమ కథా చిత్రాలు చేశాను. వినోదాన్ని పండించడం నాకు ఇష్టం. కానీ వాటితోపాటు భావోద్వేగాలతో కూడిన డ్రామాతో సినిమాలు చేయాలని చూస్తున్నాను. ఆ సమయంలో జితేందర్ రెడ్డి కథ వినే అవకాశం కలిగింది. ఆయనకు సంబంధించిన బుక్‌ను చదివిన తర్వాత నేనే ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేయాలని అనుకొన్నాను. జగిత్యాల గ్రామానికి వెళ్లి ప్రజలను, ఆయన గురించి తెలిసిన ప్రతీ ఒక్కరితో మాట్లాడి కథపై అవగాహన చేసుకొన్నాను అని విరించి వర్మ చెప్పారు.
అత్యంత ఎమోషనల్‌గా, ఎంటర్‌టైనింగ్ సమావేశంలో జితేందర్ రెడ్డి యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు రవి ప్రకాశ్, హీరో రాకేష్ వర్రే తదితరులు మూవీ విశేషాలను తెలియజేశారు. జితేందర్ రెడ్డి బయోపిక్ చేయడం గొప్ప అదృష్టం అని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











