»   » చూస్తే ..నవ్వు ఆపుకోలేరు: వికటించిన హీరో ప్రయోగం,ఏకంగా...(వీడియో)

చూస్తే ..నవ్వు ఆపుకోలేరు: వికటించిన హీరో ప్రయోగం,ఏకంగా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ తెరపైనే కాదు...సెట్ లోనూ, బయిటా తెగ నవ్విస్తూంటారు. ముఖ్యంగా ఆయన సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ అనందపరుస్తూంటారు. తను చేస్తున్న సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు బాగా టచ్‌లో ఉంటారు.

తాజాగా అక్షయ్‌ ఫేస్‌బుక్‌లో ఒక సరదా వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియోను చూసిన అభిమానులు అక్షయ్‌ నటనకి తెగ నవ్వుకుంటున్నారు. ఆ వీడియోని మీరు ఇప్పటికీ చూడకపోతే ..చూసేయండి.

ఇంతకీ ఈ వీడియో అక్షయ్ చేసిందేమిటి అంటే... షూలో టీ బ్యాగ్‌ వేస్తే.. చెడు వాసన పోతుందని కొందరు అక్షయ్‌కి సలహా ఇచ్చారట. దీంతో ఆ ప్రయోగం చేసిన అక్షయ్‌ తర్వాత షూని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఇట్లే స్పృహ కోల్పోయారు. షూ వాసన చూసిన తర్వాత అక్షయ్‌ కళ్లు తిరిగి వాలిపోయినట్లు నటించి నవ్వించారు.

కెరీర్ విషయానికి వస్తే... అక్షయ్‌ నటించిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి-2' చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోర్ట్‌ రూమ్‌ కామెడీ డ్రామాగా రూపొంది బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'జాలీ ఎల్‌.ఎల్‌.బి.' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న 'జాలీ ఎల్‌.ఎల్‌.బి.2' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. హిట్‌ అండ్‌ రన్‌ కేసు వాదిస్తున్న ఓ న్యాయవాది బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటాడనే అంశంతో ఈ చిత్రం సాగుతుంది.

ఇందులో అక్షయ్, అన్నుకపూర్‌లు న్యాయవాదులుగా, ప్రముఖ నటుడు సౌరభ్‌ శుక్లా జడ్జిగా నటిస్తున్నారు. వారణాసి, లక్నోలో ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ జరుగింది. 2013లో సుభాష్‌కపూర్‌ దర్శకత్వంలో 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' చిత్రం రూపొందింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ఆయన దర్శకత్వంలోనే 'జాలీ ఎల్‌.ఎల్‌.బి.2' తెరకెక్కుతోంది. ఈ మధ్యనే అక్కీ నటించిన 'రుస్తుమ్‌' విడుదలై మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం ఆయన 'టాయిలెట్‌-ఏక్‌ ప్రేమ్‌ కథా' చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Actor Akshay Kumar has posted a funny video where he is smelling his shoe and realising why keeping tea bags in them don't help in stopping the odour!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu