బాహుబలిలో శ్రీదేవీ.. అతిలోక సుందరిని రాజమౌళి ఎందుకు రిజెక్ట్ చేశారంటే?
తెలుగు సినిమా స్థాయిని మార్చివేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఎవరైనా కూడా రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి" సినిమానే అని చెబుతారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ఈ చిత్రం అప్పట్లో భారీ వసూళ్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో నూతన అధ్యాయాన్ని లిఖించింది. కాగా ఇక్కడ నుంచి ఇండియన్ సినిమా దగ్గర గేమ్ మార్చేసిన ఈ సినిమా తీసేందుకు జక్కన్న అండ్ కో ఎంత కష్టపడ్డారో రీసెంట్ గా రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం "మోడర్న్ మాస్టర్స్" లో రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపాడు.
సినిమా చేస్తున్న నటీనటులకు స్టార్ హోటల్స్ ఇస్తే రాజమౌళి చిన్నపాటి లాడ్జ్ లలో పడుకునేవాడు అని అక్కడే తినేవాడు అని చెప్పాడు. ఇలా చాలా ఇబ్బందుల నడుమ బాహుబలి సినిమాని వీలైన అన్ని అంశాల్లో బడ్జెట్ ని తగ్గించుకొని దానిని సినిమాకే పెట్టి తెరకెక్కించారు. సీన్ కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ అవుట్ పుట్ తో రాజమౌళి పాన్ ఇండియా సినిమా గతిని మార్చేసే సినిమాని అందించాడు.

కాగా ఈ సినిమా విషయంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. చాలా పాత్రలకి మనం సినిమాలో చూసిన ఏ నటుడు కూడా మొదటి ఛాయిస్ కాదు.. అలాగే పవర్ఫుల్ పాత్ర శివగామి పాత్రకి కూడా రమ్యకృష్ణని మొదట అనుకోలేదట. ఆమె రోల్ లో అలనాటి నటి శ్రీదేవిని మొదటిగా అనుకున్నారని అందరికీ తెలుసు. అయితే అప్పట్లో ఆమె ఎందుకు సినిమాలో భాగం కాలేదో తెలుసా? దానికి కారణం ఉందట.
శ్రీదేవి ఒక్క బాహుబలి సినిమాకే ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ అడిగారట. ఎప్పుడో 2012 లో అంత రెమ్యునరేషన్ అంటే అప్పుడు చిన్న విషయం ఏమీ కాదు. ఇంతేనా రెమ్యునరేషన్ కాకుండా సినిమా షూటింగ్ కి వచ్చే ప్రతి సారి ఆమె ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ అది కూడా బిజినెస్ క్లాస్ లో అయితే మాత్రమే చేస్తానని కూడా డిమాండ్ చేశారట.
దీనితో మేకర్స్ వెనక్కి తగ్గి ఆ భారీ మొత్తాని ఏదో సినిమాకే పెట్టుకున్నారట. ఇలా జక్కన్న ఈ సినిమా విషయంలో చాలా సేఫ్ అయ్యాడట. దీనితో ఈ చిత్రంలో అలా శ్రీదేవి స్థానంలో తక్కువ రెమ్యునేషన్ కే రమ్య కృష్ణ వచ్చి అంతకు మించి పవర్ఫుల్ పెర్ఫామెన్స్ ని అందించి బాహుబలి అనే సినిమాకి ఒక గుర్తుండిపోయే పాత్రని అందించారు.
మరి ఈ సినిమాలో ఒక్క ప్రభాస్, రానా తప్ప చాలా మంది పాత్రలకి వేరే నటీనటుల్ని అనుకొని మార్పులు చేసారు. ఫైనల్ గా భారీ రికార్డులు సెట్ చేసి బాలీవుడ్ సినిమాలకు ధీటుగా సినిమాలు అందించి ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసింగ్ హిట్స్ ని జక్కన్న కొట్టాడు. అలాగే అక్కడ నుంచి ప్రభాస్, రాజమౌళి చరిష్మా కూడా మారిపోయి ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్ సినిమాలు వారు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











