'అహనా పెళ్ళంట' దర్శకుడు వీరభద్రంతో మాట్లాడతారా?
అల్లరి నరేష్ తాజా చిత్రం "అహనా పెళ్ళంట" . ఈ చిత్రం ద్వారా వీరభధ్రం అనే దర్శకుడు పరిచయమవుతున్నారు. వీరభద్రం గతంలో ఇవివ సత్యనారాయణ, తేజ,జయంత్ సి పరాంన్జీ,కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పని చేసారు. పూర్తి స్దాయి కామిడిగా చిత్రం గురించి మీరు డైరక్టర్ ని ఏమైనా ప్రశ్నలు అడగాలని ఆసక్తి ఉంటే [email protected] కి పంపండి. మేము వీరభధ్రం ని సంప్రదించి ఆ ప్రశ్నలకు జవాబులు తీసుకుని... మా వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తాము. ప్రశ్న ఎటువంటిదైనా అసభ్యతకు చోటు ఉండరాదు. అలాగే పర్శనల్ ప్రశ్నలు అడగొద్దు. మొదటగా వచ్చిన ప్రశ్నలకు ప్రయారిటీ ఉంటుంది. ఇక ప్రశ్నతో పాటు మీ ఈమెయిల్ ఐడి పూర్తి పేరు స్పష్టంగా రాయండి.
ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సుబ్రమణ్యం అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారు. అతని సరసన రీతూ బర్మీచా నటించింది. శ్రీహరి మరో కీలకపాత్రలో కనిపిస్తారు. రఘు కుంచే సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం మార్చి 2 వ తేదిన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











