నాగచైతన్య ‘దోచేయ్’ మేకింగ్ .... (వీడియోస్)
హైదరాబాద్: నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచెయ్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన వచ్చింది. తాజా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలు విడుదల చేసారు.
ట్రైలర్ కు యూట్యూబులో రెస్పాన్స్ అద్భుతంగా వస్తోంది. ఒక రోజులోనే ఈ ట్రైలర్ చూసిన వారి సంఖ్య లక్ష దాటింది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినీ ప్రియుల్లో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్ తో మా బ్యానర్ లో నిర్మిస్తున్న దోచెయ్ చిత్రాన్ని ఏప్రియల్ 24న సమ్మర్ స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యేలా, మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్ వర్మ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ లోమరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్., ఆర్ట్: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.


Click it and Unblock the Notifications











