‘ఆక్సిజన్’ చిత్రంలో ఆ రెండు విషయాలు బాగా చూపించారు
గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్ తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్'. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు. హైదరాబాద్‌లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు.
ఈ సందర్బంగా డా. వై.సుధీర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి సిగరెట్ తాగటం వల్ల చిన్న పిల్లల ఆరోగ్యం పాడవ్వటం, మరొకటి అబ్దుల్ కలాం అవ్వాలి అనే ఆశయంతో ఉన్న యువకులు కూడా సిగరెట్ వల్ల జీవితం నాశనం చేసుకుంటారు అనే విషయాలు అందరికి అర్ధం అయ్యేలా ఈ సినిమా ద్వారా చూపించారు అన్నారు.


Click it and Unblock the Notifications











