వివిధ రకాల వైద్య పరిక్షలు చేయించుకొన్న టాప్ హీరోయిన్?
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ కి బ్లడ్ లో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటంతో డాక్టర్లు జాగ్రత్తగా ఉండమని సూచించారు. అయినప్పటికి సల్మాన్ ఖాన్ కి అత్యంత ఆప్తమిత్రుడైన వ్యక్తి ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్ళి అక్కడ డాన్సులు కూడా చేసిందట కత్రినా. శుక్ర, శనివారాల్లో ఈ వివాహ వేడుకలకు హాజరైన కత్రినా ఆదివారం ఉదయం నీరసపడిపోయింది.
బెడ్ మీద నుండి కూడా లేవలేకపోయిందట. డాక్టర్ల దగ్గరికెళితే హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని, రెస్ట్ తీసుకోవాలని సూచించారట. అయితే రోజు రోజకీ హీమోగ్లోబిన్ శాతం తక్కువ అవుతోందని కత్రినా రక్తంలో తేడా ఏంటో కనిపెట్టలేకపోతున్నామని డాక్టర్లు అంటున్నారట. దీనికి సంబంధించి వివిధ రకాల పరిక్షలు కూడా చేశారని సమాచారం. రక్తంలో అసాధారణ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను కనుగొనేందుకు తమకు సమయం కావాలని వారు చెపుతున్నారు. అప్పటివరకూ కత్రినా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కత్రినా కైఫ్‌కు అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. కత్రినా మాత్రం తనకు కాస్త నీరసంగా ఉందనీ, అంతకుమించి మరేమీ లేదని చెపుతోందట.


Click it and Unblock the Notifications











