షార్ట్ పిలిం అండ్ డాక్యుమెంటరీ ఫెస్టివల్
కరీంనగర్ ఫిలింసొసైటీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న షార్టు అండ్ డాక్యుమెంటరీ చలనచిత్రత్సోవానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నామని ఫెస్టివల్ డైరెక్టర్ వారాల ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో ఎంపికైన ఉత్తమ చిత్రాలకు పాలపిట్ట అవార్డులు, నవతరంగం అవార్డుల కింద నలభై వేల రూపాయల నగదు బహుమతులు జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. ఈ చిత్రోత్సవం కరీంనగర్ ఫిలిం భవన్‌లో జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహిస్తారని, లఘు డాక్యుమెంటరీ దర్శకులు తమ చిత్రాల్ని డిసెంబర్ 31 లోగా పంపించాలన్నారు. ఎంట్రీఫారాలు తదితర వివరాల కోసం www.anandvarala.com మరియు www.kafiso.org లేదా www.navatarangam.com సంప్రదించాలి. లేదా [email protected], [email protected] కి మెయిల్ చేయాలి.
More from Filmibeat
కరీంనగర్ వారాల ఆనంద్ ఫిల్మ్ ఫెస్టివల్ నవతరంగం షార్ట్ ఫిలిం పాలపిట్ట ఫిలిం భవన్ ఎంట్రీ ఫారం డాక్యుమెంటరీ karim nagar varala anand film festival navatarangam short film pala pitta


Click it and Unblock the Notifications











