వైట్ హౌస్‌లో ఎఆర్ రహమాన్ 'జైహో'
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన 'జై హో' డాక్యుమెంటరీని వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూడండి
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రెహమాన్ వ్యక్తిగత జీవితం, వృత్తిగత విశేషాలను, ఆయన సంగీతంలో చూపించిన వైవిధ్యాన్ని ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు దర్శకుడు ఉమేష్ అగర్వాల్. ఆస్కార్, గ్రామీ పురస్కారాలు అందుకున్న నాటి విషయాలకూ ఇందులో చోటు కల్పించారు.

రెండు ఆస్కార్లు అందుకుని భారతీయ సినిమా కీర్తిని ఇనుమడింపజేసిన స్వర తరంగం ఎ.ఆర్.రెహమాన్ - తనకు ఆస్కార్‌పై ఆశలుపోయాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''దాదాపు 12 సంవత్సరాల తరవాత ఓ కచేరి నిర్వహించబోతున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. ఇప్పటికి నెరవేరుతోంది. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు తీసుకున్న తరవాత ఆ పురస్కారమ్మీద మోజుపోయింది. తమిళ చిత్రాలకు సంగీతం అందించడం చూసి.. బాలీవుడ్‌లో 'మాకెందుకు చేయట్లేదు' అని అడుగుతున్నారు. నాకు అలాంటి తారతమ్యాలు లేవు'' అన్నారాయన .
చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో మీ అబ్బాయి ఆమీన్ - పియానో వాయించారు. మరి ఈ కచేరీల్లో కూడా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. ''అతనిప్పుడు సంగీతం బాగా నేర్చుకుంటున్నాడు. నేను రూపొందించిన ఆల్బంలో నటించాడు. అమీన్ కూడా ఆల్బం రూపొందించే ఆలోచనలో ఉన్నాడు''అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











