twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి తెరమీదకి టైటానిక్: ఇంకోసారి రానున్న విషాద, ప్రేమ కథ

    లియొనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20

    |

    లియొనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20 కోట్ల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు రూ. 1200 కోట్లు); బాక్సాఫీస్ వసూళ్ళు - 218. 7 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 13,122 కోట్లు). ప్రపంచ చరిత్రలో అత్యంత విషాద గాథగ నిలిచి పోయింది టైటానిక్. దాన్నే మరో విషాద ప్రేమ కథగా తెరమీదకి తెచ్చి మళ్ళీ ఆ టైటానిక్ ని అజరామరం చేసాడు కామెరూన్.

    చరిత్రలోనే అత్యంత విషాదం

    చరిత్రలోనే అత్యంత విషాదం

    ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇలా ఇద్దరు యువ ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్‌లతో సినిమాను ఉద్విగ్నభరితంగా తీయడం కామెరూన్‌కే చెల్లింది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేక్షకుల్ని ఆ పాత్రలు, సన్నివేశాల్లో లీనం చేసి, భావోద్విగ్నభరిత అనుభవంలో ముంచెత్తడంలో అంతకన్నా అద్భుతంగా ఉంటుంది.

    Recommended Video

    Titanic disaster revealed : Iceberg that sank it was 100000 years old
    గొప్ప థాట్

    గొప్ప థాట్

    ఒక క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలో సినిమాను చూపించడం గొప్ప థాట్.దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు ఈ సినిమాపై మక్కువ తీరక, ఓడ ప్రమాదం జరిగి వందేళ్ళవుతున్న వేళ ‘టైటానిక్ -3డి' వెర్షన్‌ను 2012 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అది కూడా పెద్ద హిట్టే. అదనంగా 343.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ త్రీడీ వెర్షన్

    20 ఏళ్ళు అవుతుంది

    20 ఏళ్ళు అవుతుంది

    ఇప్పుడు ఈ మూవీ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది..ఈ సందర్భంగా మరోసారి ఆ టైటానిక్‌ తెరపైకి తెస్తూ.. తను తీసిన చిత్రంలోని లోటుపాట్లపై వివరణ ఇస్తూ టైటానిక్‌పై ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నారట. ఆ చిత్రంలోని పలు సన్నివేశాల్లో జరిగిన సంఘటనలు సందేహాలు గా మిగిలిపోయాయి.

    టైటానిక్‌ను కళ్లముందుకు

    టైటానిక్‌ను కళ్లముందుకు

    వాటికి వివరణ ఇస్తూ.. టైటానిక్‌ చిత్ర విశేషాలు.. చరిత్ర సవివరంగా తెలిపేలా టైటానిక్‌పై గంట నిడివి గల ఒక డాక్యుమెంటరీని రూపొందించనున్నారు. ఇప్పుడు నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌ వారితో కలిసి తాజా పరిశోధనలు.. సాంకేతిక సహాయంతో మరోసారి టైటానిక్‌ను కళ్లముందుకు తీసుకరాబోతున్నారట.. ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    James Cameron to make documentary on 'Titanic' for the movie's 20th anniversary
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X