కత్తి vs కోన: మళ్లీ వార్ మొదలైంది... టాయిలెట్లో మహేష్ కత్తి ఫోటో!
Recommended Video

పవన్ కళ్యాణ్ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని మహేష్ కత్తిని సినీ రచయిత, పవన్ కళ్యాణ్ స్నేహితుడు కోన వెంకట్ సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అభిమానులు కూడా సంయమనం పాటించాలని, జనవరి 15 వరకు అందరూ సైలెంటుగా ఉండాలని కోన వెంకట్ జనవరి 7న చేసిన ట్వీట్ ద్వారా సూచించారు. కోన సూచన మేరకు కత్తి కూడా జనవరి 15 వరకు సైలెంటుగానే ఉన్నారు.

ఎక్కడున్నారు సర్? ..... జనవరి 16న మౌనం వీడిన కత్తి
జనవరి 15 వరకు సైలెంటుటగా ఉన్న మహేష్ కత్తి జనవరి 16 టీవీ ఛానళ్ల ముందుకు వచ్చారు. ‘ఎక్కడున్నారు సర్? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. మీరేం చేయగలరు?' అని మహేష్ ట్వీట్ చేశారు.

నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?
మహేష్ కత్తి ట్వీట్‌కు కోన వెంకట్ రిప్లై ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు నేను జనవరి 7న ట్వీట్ పెట్టిన తరువాత కూడా నువ్వు ఇదే అంశంపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్ కళ్యాణ్, అతని అభిమానులను ఎటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?' అని కోన వెంకట్ కత్తిని ప్రశ్నించారు.

మా నాన్నను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు కలిశారు
మా పల్లెకొచ్చి. మా ఇంటికొచ్చి. మా నాన్నను "మర్యాద పూర్వకంగా" కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకొచ్చింది? అదే మా ఇల్లు మావాళ్ళు ఉండే పల్లెలోకాకుండా ఏ టౌన్ లోనో, ఒంటరిగా అయ్యుంటే!?.... అంటూ మహేష్ కత్తి ట్వీట్ చేశారు.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల అసలు రూపం
ఖమ్మంలో పవన్ కళ్యాణ్ అభిమానులు టాయిలెట్లో నా ఫోటో అతికించారు. నా మౌనాన్ని నా వీక్ నెస్ అనుకుంటే పొరపాటే..... అంటూ మహేష్ కత్తి హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











