'కింగ్' చిత్రంలో చేయటమే నా పెద్ద తప్పు
కింగ్ చిత్రంలో నా పాత్ర ఏమిటన్నది చూసుకోకుండా ఒప్పుకోవటం పెద్ద బ్లండర్ మిస్టేక్..అయినా చెప్పిందొకటి..ఫైనల్ అవుట్ పుట్ మరొకటి. నా పాత్రను ఎడిటింగ్ టేబుల్ పై చాలా వరకూ కట్ చేసారు. అంటూ మమతా మోహన్ దాస్ తాజాగా తన ఆక్రోశం వ్యక్తం చేసింది. అయినా ఇదొక లెస్సన్. ఇలాంటి తప్పుని ఇంకెప్పుడూ చేయకూడదని పెద్ద పాఠం నేర్చుకున్నాను. ఇలా మొహమాటాలకు పోయే నా కెరీర్ ని సెకెండ్ ఇన్నింగ్స్ లా మారే స్ధితికి తెచ్చుకున్నాను అంటూ బాధపడింది. తాజాగా ఆమె నాగార్జున సరసన మరో చిత్రం కేడీలో చేస్తోంది. ఆ విషయం చెపుతూ..కేడీ చూసాక నాకు ఎలాంటి పాత్రలు ఇస్తే బెటర్ అనే నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ మేకర్స్ వస్తారనే నమ్మకం ఉంది. రెండో హీరోయిన్ పాత్రలు, గుంపులో గోవిందం పాత్రలూ నాకొద్దు అంటూ ఖరాఖండీగా చెప్పుకోచ్చింది ఈ గాయని కమ్ యాక్టర్.
కింగ్ నాగార్జున మమతా మోహన్ దాస్ శ్రీను వైట్ల త్రిష శ్రీహరి కేడీ king nagarjuna srinu vytla trisha srihari mamata mohan das kedi


Click it and Unblock the Notifications