»   » ఇది డాలీవుడ్ మూవీ గురూ....

ఇది డాలీవుడ్ మూవీ గురూ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాదీ: చిత్రాలను డెక్కన్ మూవీస్ అంటుంటారు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు రూపొందినప్పటికీ అవి కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ "రాజశ్రీ ప్రొడక్షన్స్" సహకారంతో ఇటీవల విడుదలైన ''దావత్ ఎ షాది'' ఘన విజయం సాధించి, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇప్పుడు డాలీవుడ్(డెక్కన్ చిత్ర పరిశ్రమ) లోనూ ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు రూపొందించడం ప్రారంభించారు.

''దావత్ ఎ షాది''తో ఘన విజయం అందుకొన్న దర్శకుడు సయ్యద్ హుస్సేన్ తన మూడో చిత్రంగా ''సలీం జహంగీర్ ఇన్ అమెరికా'' అనే సినిమాను త్వరలో ప్రారంభించనున్నారు.

ఈ చిత్రాన్ని డాలీవుడ్ ఫిలిమ్స్ సంస్థతో కలిసి ఇఫ్తేకార్ షరీఫ్ ఆశీస్సులతో.. ఆర్ట్ స్పాట్ మరియు లైవ్ విజన్ ఎంటర్ టైన్మెంట్ (అమెరికా) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Dollywood New Movie "Saleem Jahangir in America"

డాలీవుడ్ స్టార్ హీరోలైన మస్త్ అలీ, అజీజ్ నాజర్ లు ఈ చిత్రంలో టైటిల్ పాత్రలు పోషించనున్నారు.

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు సయ్యద్ హుస్సేన్, ఇఫ్తేకార్ షరీఫ్ మరియు నటులు మస్త్ అలీ, అజీజ్ నాజర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ''మా గురు సమానులైన ఇఫ్తెకార్ షరీఫ్ గారి ఆశీస్సులతో విడుదలైన ''దావత్ ఎ షాది'' ఘన విజయం సొంతం చేసుకొంది. ఆ సినిమా అందించిన స్పూర్తితో ''సలీం జహంగీర్ ఇన్ అమెరికా'' సినిమాను మొదలుపెడుతున్నాము. అమెరికాలో దాదాపుగా 50% చిత్రీకరణ జరుపుతాం. అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న మొట్టమొదటి హైదరాబాదీ సినిమాగా ''సలీం జహంగీర్ ఇన్ అమెరికా'' ఎప్పటికీ నిలిచిపోతుంది. మా మునుపటి సినిమా తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

ఇఫ్తెకార్ షరీఫ్ మాట్లాడుతూ.. ''తెలుగు ప్రేక్షకులు కూడా మా డాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. ఇకనుంచి మా డాలీవుడ్ నుంచి మంచి సినిమాలు వస్తాయి, వాటిని కూడా ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని సినిమాలు రూపొందించేందుకు మాకు ఉత్సాహాన్నివ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా దర్శకుడు సయ్యద్ హుస్సేన్ ''దావత్ ఎ షాది'' వలె ''సలీం జహంగీర్ ఇన్ అమెరికా'' చిత్రంతోనూ ఘన విజయం అందుకోవాలని కోరుకొంటున్నాను'' అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోలు మస్త్ అలీ మరియు అజీజ్ నాజర్ లు ''హైదరాబాదీ నవాబ్స్'' సినిమాను తమను ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు.. తమ తాజా చిత్రమైన ''సలీం జహంగీర్ ఇన్ అమెరికా''ను కూడా ఆదరించాలని కోరారు!!

English summary
Dollywood New Movie "Saleem Jahangir in America" shooting starts soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu