రామ్ చరణ్ నిశ్చితార్దం కోసం డంగు సున్నంతో...
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ పేరు చెప్పి దోమకొండ కోట కొత్త మెరుగులు,సొగుసులు దిద్దుకుంటోంది.దోమకొండ సంస్థాన వారసుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు కొడుకు అనిల్ కోడలు శోభనల కూతురైన ఉపాసనను చరణ్ పెళ్లాడనున్న విషయం తెలిసిందే.దాంతో ఈ కోటకు పూర్వ వైభవం దక్కింది. నిజానికి ఈ కోటలో హైలెట్ అద్దాల మేడ.అక్కడకు వెళ్లే ప్రధాన ద్వారాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నారు.అందుకోసం రాజస్ధాన్ నుంచి తెప్పించిన డంగు సున్నంతో మరమత్తులు చేస్తున్నారు.పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రతినిధి బృందం పర్యవేక్షణలో ఈ అభివృద్ది పనులు జరుగుతున్నాయి.ఇక ఈ కోటను చూసేందుకు రోజూ సందర్సకులు ఎక్కడెక్కడనుంచో వస్తున్నారు.వచ్చే నెల రెండవ తేదిన జరిగే ఈ పంక్షన్ చాలా గ్రాండ్ గా జరగాలని ఇరు పక్షాల వారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.అందులోనూ ఉపాసనకు చారిత్రిక కట్టడాలంటే చాలా ఇష్టం కావటంతో ఆమె ఆసక్తి మేరకే ఈ కోటలో నిశ్చితార్దం ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తున్నారు.ఇక నిజాం కాలం నాటి ఈ కోట ఇప్పుడు అందాలతో మెరిసిపోతోంది.


Click it and Unblock the Notifications











