twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలిరోజు కలెక్షన్స్ 15.3కోట్లు..రికార్డు

    By Srikanya
    |

    షారూఖ్ ఖాన్ తాజా చిత్రం డాన్ 2 కలెక్షన్స్ లో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్స్ 15.3 కోట్లు. ఈ కలెక్షన్స్ బాలీవుడ్ లో రికార్డు అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా వీకెండ్స్ శని,ఆదివారాల్లో కలెక్షన్స్ అదిరిపోతాయి..కానీ వర్కింగ్ డే అయిన శుక్రవారం ఈ రేంజి కలెక్షన్స్ ని ఊహించలేం అని బాలీవుడ్ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి భాక్సాఫీస్ వద్ద షారూఖ్ బాద్షా అనిపించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2006 లో వచ్చిన డాన్ చిత్రానికి సీక్వెల్. సాధారణంగా సీక్వెల్ చిత్రాలుకు ఆదరణ తక్కువగా ఉంటుంది. దానిని ఈ చిత్రం బ్రేక్ చేసిందని చెప్తున్నారు.

    ఇక రా.వన్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అప్పట్నుంచి షారూఖ్ అభిమానులు 'డాన్-2' కోసం ఎదురుచూపులు ఈ చిత్రం ఓపినింగ్స్ కు ఊతమిచ్చాయి. అలాగే ఈ చిత్రంలో షారూఖ్ పాత్ర పోలీసులకు వాంటెడ్ మ్యాన్ గా నడుస్తుంది. దాదాపు పదకొండు దేశాలు ఇంటలజెన్సీ ఏజెన్సీలు అతనికోసం వెతుకుతూంటాయి. అతను ఇప్పుడు ఆసియన్ అండర్ వరల్డ్ కు మకుటం లేని మహారాజు అవుతాడు. ఈ సారి అతన్ని పట్టుకోవటానికి ఎఫ్.బి.ఐ ఏం మాస్టర్ ప్లాన్ వేసింది. వాటిని డాన్ ఎలా తిప్పికొట్టాడనేది స్టైలిష్ గా సాగే ఎంటర్టైనర్. ఇందులో షారూఖ్ ..విలన్ గా కనిపిస్తాడు. డర్,బాజీగర్ తరహా పాత్రల్లో కనిపించి తన అభిమానులను ఆనందపరచటానికి షారూఖ్ తన దైన శైలిలో అదరకొట్టాడంటున్నారు. మూడు వేల ప్రింట్స్ తో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేసిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో వందకు పైగా థియేటర్స్ లో విడుదల అయ్యింది. తమిళ,తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

    English summary
    Shahrukh Khan’s “Don 2 – The King is Back” has earned Rs.15.3 crore on the opening day, which is the highest first day collection on a non-holiday Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X