3000 ప్రింట్లతో సూపర్ స్టార్ చిత్రం

By Srikanya

ఫర్హాన్‌అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ హీరోగా ఐదేళ్ల కిందట విడుదలై విజయం సాధించిన చిత్రం 'డాన్'. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన 'డాన్-2'లో ప్రియాంక చోప్రా అదే రోమా పాత్రలో కనపించనుంది. మొదటి డాన్‌లో హీరోని పోలీసులకు పట్టివ్వాలనే లక్ష్యంతో అతనితో ప్రేమలో పడ్డట్లు నటించిన ప్రియాంక చోప్రా.. రెండో డాన్‌లోనూ అదే లక్ష్యాన్ని కొనసాగిస్తుంది. ఏదోవిధంగా డాన్‌పై పగతీర్చుకోవటానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అయితే డాన్‌లో కొన్ని విషయాలు నచ్చి అతనితో మళ్లీ ప్రేమలోనూ పడుతుంది. అంతలోనే లక్ష్యం గుర్తొచ్చి మళ్లీ పగపడుతుంది. కాగా ఇలా తమ ఇద్దరి మధ్య కొనసాగే ప్రేమ-పగ బంధం తో ఈ చిత్రం నడుస్తుంది.

ఇక రా.వన్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అప్పట్నుంచి షారూఖ్ అభిమానులు 'డాన్-2' కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో షారూఖ్ పాత్ర పోలీసులకు వాంటెడ్ మ్యాన్ గా నడుస్తుంది. దాదాపు పదకొండు దేశాలు ఇంటలజెన్సీ ఏజెన్సీలు అతనికోసం వెతుకుతూంటాయి. అతను ఇప్పుడు ఆసియన్ అండర్ వరల్డ్ కు మకుటం లేని మహారాజు అవుతాడు. ఈ సారి అతన్ని పట్టుకోవటానికి ఎఫ్.బి.ఐ ఏం మాస్టర్ ప్లాన్ వేసింది. వాటిని డాన్ ఎలా తిప్పికొట్టాడనేది స్టైలిష్ గా సాగే ఎంటర్టైనర్. ఇందులో షారూఖ్ ..విలన్ గా కనిపిస్తాడు. డర్,బాజీగర్ తరహా పాత్రల్లో కనిపించి తన అభిమానులను ఆనందపరచటానికి షారూఖ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. మూడు వేల ప్రింట్స్ తో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేస్తున్నారు. ఓవర్ సీస్ లో వందకు పైగా థియేటర్స్ లో విడుదలచ చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X