నాగ్ డిసెంబర్ సెంటిమెంట్
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లేం కొత్తకాదు. హీరోలు మొదలు టెక్నీషియన్ల దాకా సెంటిమెంట్లు ఫాలో అవుతారు. ఒక సినిమా ఒక అక్షరంతో హిట్ కొడితే అదే అక్షరాలతో ఆ తరువాత మరిన్ని సినిమాలు వస్తాయి. సినిమా సెంటిమెంట్ కు హీరో నాగార్జునా అతీతుడేంకాదు. ఆయనకు డిసెంబర్ సెంటిమెంట్ ఉంది. డిసెంబర్ లో విడుదల అయిన నాగార్జున సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. నాగార్జున హీరోగా తాజాగా రూపొందిన డాన్ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతోంది. డాన్ సినిమా కూడా సూపర్ హిట్ అవడం ఖాయమని భావిస్తున్నారు. ఆ సెంటిమెంట్ తోనే డిసెంబర్ 20న డాన్ విడుదల కాబోతోంది. ఇందులో అనుష్క హీరోయిన్. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన డాన్ సినిమాను ఎమ్.ఎల్.కుమార్ చౌధరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











