ఆంధ్ర కు చేరుకోని డాన్???

By Staff

అందరు ఎదురు చూస్తున్న డాన్ గురువారం(డిసెంబర్ 20,2007)నాడు విడుదల అయింది. అయితే ఈ సినిమాను అన్ని ప్రాంతాలలో విడుదల చేయలేకపోయినట్టు తాజా సమాచారం. హైదరాబాద్, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలోనే ఈ సినిమా ప్రదర్శన జరుగుతోంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విడుదలకు నోచుకోలేదు. ప్రింట్లు నిర్ణీత సమయానికి థియేటర్లకు చేరుకోలేదు. విడుదలకు ముందు రోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా నిర్ణీత సమయానికి థియేటర్లకు చేరుకోలేకపోయింది. ఆర్థిక అంశాలను సెటిల్ చేయడంలో నిర్మాత ఎమ్ఎల్ కుమార్ చౌదరి విఫలమవడం మూలంగానే ఈ సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. లాబ్ నుంచి బయటకు ప్రింట్లు రావడంలో ఆలస్యమయింది. ఈ సాయంత్రానికి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున సినిమా ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X