యూరప్ లో డాన్ శీను!
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డాన్ శీను" ప్రస్తుతం యూరప్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గత ఏప్రిల్ 17 నుండి స్విట్జర్లాండ్, యూరప్ లలో రెండు పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో పాటు చాలా శాతం వరకు టాకీ పార్టు కూడా పూర్తయ్యింది. తాజాగా షెడ్యూల్ మే 23 వరకు యూరప్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత మే 29 వరకు దుబాయ్ లో జరిగే షెడ్యూల్ లో ఈ చిత్రంలోని విలన్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించడంతో 42 రోజుల సుదీర్ఘ విదేశీ షెడ్యూల్ పూర్తవుతుంది. శ్రియ హీరోయిన్ గా ఇందులో ముఖ్య పాత్ర చేస్తోంది. అంజనా సుఖాని మరో ముఖ్య పాత్ర ను పోషిస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్, గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు కోన వెంకట్. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
రవితేజ శ్రియ అంజనా సుఖాని గోపిచంద్ మల్లినేని కోన వెంకట్ మణిశర్మ సమీర రెడ్డి ravi teja shriya anjana sukhani gopichand mallineni kona venkat mani sharma sameera reddy


Click it and Unblock the Notifications