Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అనుష్కకి పొగడ్తలు...శ్రియకి చీవాట్లు..
డాన్ శీను పాటల విడుదల కార్యక్రమం నిన్న(22.17.10) సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రవితేజ, అనుష్క, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, రాజమౌళి, సునీల్, రామానాయుడు, దాసరి నారాయణరావు, వెంకట్, గీతా మాధురి, శ్రీహరి, ఝాన్సీ, సాగర్, గోపీచంద్ మున్నగువారు వచ్చారు. సిడి ని దాసరి ఓపెన్ చేసి రామానాయుడు గారికి ఇచ్చారు. క్యాసెట్ ని రామానాయుడు ఓపెన్ చేసి శ్రీహరి కి ఇచ్చాడు.
అందాల బొమ్మాళీ అనుష్క..అందాల అదుపులేని శ్రియను 'డాన్ శీను" సాక్షిగా దర్శకరత్న దాసరి చేత తిట్టించింది..ఏలా అనుకుంటున్నారా? 'డాన్ శీను" ఆడియో గురువారం విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆడియోకి చిత్రంలో నటించిన శ్రియ రాలేదు..అలాగే చిత్రానికి ఎటువంటి సంబంధం లేని అమలాపురం సరోజ మాత్రం అటెండ్ అయింది.
ఈ మధ్య పర్సనల్ గా అనుష్క పై ప్రేమ కురిపిస్తున్న దాసరి ఈ ఆడియోను విడుదల చేయడానికి వచ్చారు.. ఆడియో విడుదల అనంతరం మాట్లాడిన దాసరి అనుష్కను అందలానికి ఎక్కించాడు..అలాగే శ్రియపై అక్షింతలు వేశాడు(తిట్ల వర్షం కురిపించాడు) దాసరి మాట్లాడుతూ తన సినిమా కాకపోయినా అనుష్క ఈ వేడుకకు రావడం అభినందనీయం. అనుష్కను చూసి చాలా గర్వపడగాను..కొంతమంది పరభాషా అమ్మాయిలకి..తెలుగు సినిమా అంటే చిన్న చూపు ఉంటుంది.. కానీ అనుష్క ఆ (అమటాపురం సరోజ అనుకోనేరు)టైపు కాదు.. అంటూ అనుష్కను పొగడ్గలతో ముంచెత్తారు..అనుష్క మాత్రం ఈ వేడుకలో విక్రమార్కుడితో చాలా హ్యాపి హ్యాపిగా కనిపించింది.