twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ రీమేక్ గా రవితేజ ఆ చిత్రం

    By Srikanya
    |

    తెలుగులో హిట్టైన సినిమాలకు ఇప్పుడు హిందీలో రీమేక్ ద్వారా డిమాండ్ మొదలైంది. తాజాగా రవితేజ, శ్రియ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను చిత్రాన్ని టిప్స్ కంపెనీ వారు రీమేక్ చేయటానికి హక్కులు తీసుకున్నారు. ఇప్పటికే రవితేజ చేసిన విక్రమార్కుడు చిత్రం రీమేక్ ని అక్షయ్ కుమార్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. మరో ప్రక్క శ్రీను వైట్ల సూపర్ హిట్ చిత్రం ఢీని కూడా హిందీలో రీమేక్ చేయాటనికి సన్నాహాలు జరుగుతున్నాయి. అబిషేక్ బచ్చన్, అమితాబ్ తండ్రి కొడుకులుగా ఆ చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఆ చిత్రంలో కీలకపాత్రలో చేయటానికి సంజయ్ దత్ ఓకే చేసారు. తెలుగులో శ్రీహరి చేసిన జెనీలియా అన్న పాత్రని సంజయ్ దత్ చేయనున్నారు. సంజయ్ దత్ ని కలసిన కోన వెంకట్ ఈ క్యారెక్టర్ ని చెప్పి ఒప్పించినట్లు చెప్పారు. దర్శకుడు ఇంద్రకుమార్ ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.

    అలాగే ఇప్పటిక్ రెడీ, పోకిరి చిత్రాలు హిందిలో రీమేక్ అయ్యాయి. రవితేజ కిక్ చిత్రం కూడా రీమేక్ కు రెడీగా ఉంది. సునీల్ చేసిన మర్యాద రామన్న రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు రచయిత కోన వెంకట్ కూడా హిందీలో బిజీ అవుతున్నారు. ఇంతకుముందు తెలుగులో హిట్టైన చిత్రాలను తమిళం వారు ఎగబడి కొనుక్కునే వారు. ఇప్పుడు ఆ పనిని హిందీ దర్శక, నిర్మాతలు చేస్తున్నారు. తెలుగు సినిమా రీమేక్ అంటే హిందీ హీరోలు ఆసక్తి చూపటం కూడా ఓ కారణంగా చెప్తున్నారు. తెలుగులో హిట్టైన ఠాగూర్ చిత్రం సైతం హిందీలో అమీర్ తో రీమేక్ చెయ్యటానికి చర్చలు జరుగుతున్నాయి. ఇలా తెలుగు టు హింది రీమేక్ లు హవా మొదలైంది.

    English summary
    The remake rights of Ravi Teja, Shriya Saran starrer Don Seenu have been bought by Tips Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X