'డాన్ శీను' రికార్డు 4 రోజుల్లో రూ.8కోట్లు
"ఈ చిత్రానికి మొదటి నాలుగురోజుల్లో 8 కోట్ల షేర్ వచ్చింది. ఇది రవితేజ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్. రవితేజలోని ఎనర్జీ, శ్రీహరి అభినయం చిత్రం విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రం విజయంలో లాజిక్, మ్యాజిక్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. ఇక తొలిచిత్రంతోనే గోపీచంద్ అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయారు' అంటూ చెప్పుకొచ్చారు 'డాన్ శీను' చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి.
అలాగే ఈ చిత్రం ఎలా మొదలైందో చెపుతూ...'కిక్' తర్వాత మళ్ళీ రవితేజతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థలో ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో దర్శకుడు గోపి చెప్పిన 'డాన్‌శీను' కథ నచ్చడం..వెంటనే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. నేడు సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది' అన్నారు అచ్చిరెడ్డి. రవితేజ, శ్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











