‘పులి’ గర్జించలేదని కళ్ళు మూసుకొని దూసుకుపోతున్నాడు డాన్ శీను
పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టాక్ తో సంబంధం లేకుండా ఇతర చిత్రాల బిజినెస్ ను ఎఫెక్ట్ చేస్తుందని భయపడుతూ ఉంటారు. అదీ టాక్ బాగోలేని సినిమాల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా మారిపోయే ప్రమాదముంటుంది. భారీ అంచనాలున్న 'కొమరం పులి" విడుదలైతే మార్కెట్లో వున్న సినిమాలు డల్ అవుతాయని ట్రేడ్ నిపుణులు లెక్కలు కడుతూ వున్నా, ధైర్యం చేసి ముందుకి దూకిన చిత్రాలు ఇప్పుడు హ్యాపీగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాయి.
అదిగో, ఇదిగో అని భయపెట్టడమే తప్ప 'పులి" బోనులోంచి బయటకు వచ్చే రోజు ఎప్పుడనేది ఎంతకీ తేలకపోవడంతో వీక్ టాక్ తెచ్చుకున్న 'డాన్ శీను" లాంటి సినిమాలకు పెద్ద ప్లస్ అయింది. ఆగస్టు 11 లేదా 18న వస్తుందనుకున్న 'పులి" ఆగస్టులో రానట్టేనని తేలిపోవడంతో 'డాన్ శీను" కి మరో మూడు వారాలు ఎదురే ఉండదని స్పష్టమైంది. ఈ గ్యాప్ లో భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో ఫస్ట్ వీక్ పది కోట్లు రాబట్టిన 'డాన్ శీను" ఇక ఈజీగా ఇరవై కోట్ల మార్కుని దాటేస్తుందిని అంచనాలున్నాయి. మరోవైపు 'మర్యాద రామన్న" మూడో వారంలోనూ టాప్ లో కొనసాగుతూ రెవెన్యూ పరంగాను సూపర్ హిట్ గా నిలిచింది. 'కొమరం పులి" ఆగస్టులో రాదని తెలియడంతో పలు చిన్న చిత్రాలకు రెక్కలొచ్చాయి.
'కొమరం పులి" విడుదల ఆలస్యం అవడానికి తెలుస్తోన్న కారణాలు చూస్తుంటే సెప్టెంబర్ లో అయినా సకాలంలో ఈ చిత్రం విడుదలవుతుందా అనే అనుమానాలొస్తున్నాయి.


Click it and Unblock the Notifications











