రవితేజ ...'డాన్ శీను' మొదటివారం కలెక్షన్ అంతా?
కిక్ తరవాత మా సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. మొదటి వారం రోజుల్లోనే రూ.13,47,29,586 వసూలు చేసింది. ఇది కిక్ మొదటి వారం వసూలు కంటే ఎక్కువ. సినిమాకొస్తున్న ప్రేక్షకులు లాజిక్కులు, మ్యాజిక్కుల కంటే వినోదం ఉంటే చాలు అనుకొంటున్నారు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించగలిగితే విజయం సాధించినట్లే. మా 'డాన్ శీను' ఆ తరహా చిత్రం కాబట్టే ప్రేక్షకాదరణ బాగుంది అంటున్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఆయన సమర్పణలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'డాన్ శీను' వారం క్రిందట రిలీజైంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రియ చేసింది. అలాగే గోపీచంద్ మలినేని దర్శకుడుగా పరిచయం అయ్యారు.
More from Filmibeat
రవితేజ డాన్ శీను శ్రియ గోపీచంద్ మలినేని అచ్చిరెడ్డి ravi teja don seenu shriya gopichand malineni acchireddy


Click it and Unblock the Notifications











