ఎంజాయ్ దొరుకుతోంది కాబట్టే ...'డాన్ శీను' హీరోయిన్
"ఒక సినిమా చేసి వదిలేద్దామనుకున్నా. అయితే నటిగా ఎంజాయ్ చేయడం ప్రారంభించడంతో సినీరంగంలోనే వుండాలని నిర్ణయించుకున్నాను" అంటోంది అంజనా సుఖానీ. రవితేజ హీరోగా రూపొందిన 'డాన్ శీను'లో సెకెండ్ హీరోయిన్ గా తన గ్లామర్ తో ప్రేక్షకుల్ని ఆమె ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.."యాథృచ్ఛికంగా నటినయ్యాను. నా చదువుకు డబ్బు సమకూర్చుకునేందుకు మోడలింగ్ చేశాను. దీనితో కొన్ని మంచి ఆఫర్లు రావడంతో నటినైపోయాను" అని ఆమె చెప్పింది. అలాగే. "మనం చేసేది కొంతమేరకే వుంటుంది. మనకు అభద్రత కలిగించే సందర్భాలు కూడా వుంటాయి. అయితే మనం ఒక సినిమాలో ఒక భాగం మాత్రమే. చిత్రం హిట్, ఫ్లాప్ లకి పూర్తి కారణం మనం కాదు" అని చెప్తోంది. మొత్తానికి తెలుగులో ఒక్క సినిమాకే చాలా విషయాలు నేర్చుకుందన్నమాట.
అంజనా సుఖానీ డాన్ శీను రవితేజ శ్రియ గోపీచంద్ మలినేని ravi teja shriya don seenu gopichand malineni anjana sukhani


Click it and Unblock the Notifications