'డాన్ శీను' రవితేజ..ఇప్పుడు ఎక్కడ?
రవితేజ నూతన చిత్రం 'డాన్ శ్రీను' స్విస్,స్పెయిన్ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రియల్ 15 న ప్రారంభం అయిన ఈ చిత్రం కంటెన్యూగా నలభై రోజులు పాటు జరుగుతుంది. శ్రియ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతారంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.అచ్చిరెడ్డి సమర్పకుడిగా..సహ నిర్మాతగా వి.సురేష్ రెడ్డి వ్యవహిస్తున్నారు. ఇంతకు ముందు ఇదే బ్యానర్ పై రవితేజ హీరోగా కిక్ చిత్రం వచ్చి సక్సెస్ అయింది. అలాగే ఢీ వంటి వినోదాత్మక చిత్రం రచన చేసిన కోనవెంకట్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.
ఇక కథ ప్రకారం రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళంతా డాన్ శీను అని పిలుచుకుంటూంటాడు. దాన్ని నిజం చేసుకోవటానికి అతను హైదరాబాద్ వస్తాడు. అక్కడ డాన్ గా ఉన్న శ్రీహరి మనుషులను కొడతాడు. ఎందుకు కొట్టావు అంటే నీ దృష్టిలో పడటానికే అంటాడు. దాంతో అతను రవితేజని ఎలా గయినా ఇరికించాలని ముంబయిలో మరో పెద్ద డాన్ చెల్లెలను లైన్ లో పెట్టమని పురమాయిస్తారు. దాంతో అక్కడికి వెళ్ళిన శీను తను పురమాయించిన అమ్మాయిని కాక తన చెల్లినే లైన్ లో పెట్టాడని తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీహరి...రవితేజని ఏం చేస్తాడు...అలాగే రవితేజకు శ్రీహరితో తలపడాల్సినంత అవసరం ఏమొచ్చిందనే ప్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుందంటున్నారు.


Click it and Unblock the Notifications











