Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ 'డాన్ శీను' తో మెర్సిడెస్ బెంజ్ టై అప్
రవితేజ తాజా చిత్రం 'డాన్ శీను' కోసం మెర్సిడెస్ బెంజ్ కార్ల షోరూమ్ తో నిర్మాతలు ఓ ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేస్తూ షోరూమ్ ఎండీ యశ్వంత్ జలుక్..'డాన్ శీను' సినిమాకు అవసరమైన బెంజ్‌కార్లను ఇవ్వడంతో పాటు ఎనిమిది ప్రివిలేజ్ కార్డులను కూడా అందజేస్తామన్నారు. అలాగే ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మించే ప్రతి సినిమాతో ఇదేవిధంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆదివారం హీరో రవితేజ, డాన్ శీను దర్శకుడు గోపిచంద్ మలినేని తదితరులు జూబ్లీహిల్స్‌లోని మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌కు విచ్చేసి కొత్తగా మార్కెట్లోకి విడుదలైన జీఎల్ 350 సీడీఐ ఎస్యూవీ మోడల్‌ను పరిశీలించారు.
ప్రముఖ నటుడు శ్రీహరి ఓ ముఖ్యపాత్రను చేస్తున్న ఈ చిత్రం ద్వారా గోపిచంద్ మలినేని దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు. అలాగే ఢీ వంటి వినోదాత్మక చిత్రం రచన చేసిన కోనవెంకట్ ఈ చిత్రానికి రచన చేయటం మరో ప్లస్. ఇక కథ ప్రకారం రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళంతా డాన్ శీను అని పిలుచుకుంటూంటాడు. దాన్ని నిజం చేసుకోవటానికి అతను హైదరాబాద్ వస్తాడు. అక్కడ డాన్ గా ఉన్న శ్రీహరి మనుషులను కొడతాడు. ఎందుకు కొట్టావు అంటే నీ దృష్టిలో పడటానికే అంటాడు. దాంతో అతను రవితేజని ఎలా గయినా ఇరికించాలని ముంబయిలో మరో పెద్ద డాన్ చెల్లెలను లైన్ లో పెట్టమని పురమాయిస్తారు.
దాంతో అక్కడికి వెళ్ళి న శ్రీను తను పురమాయించిన అమ్మాయిని కాక తన చెల్లినే లైన్ లో పెట్టాడని తెలుసుకున్నా ఒరిజనల్ డాన్ రవితేజని ఏం చేస్తాడు...అలాగే రవితేజకు అంత అవసరం ఏమొచ్చిందనే ప్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుందంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ కథనం నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆర్.ఆర్.మూవీ మేకర్స్అధినేత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూంటే కె.అచ్చిరెడ్డి సమర్పకుడిగా..సహ నిర్మాతగా వి.సురేష్ రెడ్డి వ్యవహిస్తున్నారు.