అప్పుడు రామ్ చరణ్..ఇప్పుడు రవితేజ..
గత సంవత్సరంలో జూలై 31న వచ్చిన 'మగధీర" లో రామ్ చరణ్ కి సపోర్ట్ చేసిన షేర్ ఖాన్ శ్రీహరి ఈ సంవత్సరం 'డాన్ శీను" రవితేజకి తన మద్దతు ప్రకటించారు. రవితేజ-శ్రియ జంటగా రూపొందుతోన్న 'డాన్ శీను" కి శ్రీహరే స్పెషల్ ఎట్రాక్షన్ అనిపించుకునే రేంజ్ లో అద్భుతంగా వచ్చిందట రియల్ స్టార్ రోల్. ఈ రోజు(జూలై 22) 'డాన్ శీను" ఆడియోని హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో రిలీజ్ చేసి ఆగస్ట్ ప్రథమార్థంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు పంపాలని ప్రయత్నిస్తోన్న ఆర్ ఆర్ మూవీమేకర్స్ వర్గం చిత్ర విజయం పై గట్టి ధీమాని వ్యక్తం చేస్తోంది. రవితేజ-శ్రీహరిల పాత్రల ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే రీతిలో వుంటాయనీ శ్రియ గ్లామర్ -మణిశర్మ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అవుతాయనీ అంటూ తమ బేనర్ లో రవితేజకి 'కిక్" ని మించే హిట్ 'డాన్ శీను" రూపంలో వస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఆర్ ఆర్ మూనవీమేకర్స్ అధినేత వెంకట్.


Click it and Unblock the Notifications











