ఆ విషయం అడగొద్దంటున్న పూరి జగన్నాథ్

By Bojja Kumar

తనదైన ప్రత్యేకమైన శైలితో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మెప్పు పొంది క్రేజీ దర్శకుడుగా పేరు తెచ్చుకన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తెలిసిందే. ఈ చిత్రానికి అసలు కథే లేదు అంటున్నాడు దర్శకుడు. సినిమాల్లో పాత్రల రూపకల్పన కూడా విచిత్రంగా ఉంటాయట.

ఇటీవల ఆయన మాట్లాడుతూ...సినిమా చూస్తే ఎంజాయ్ చేయాలేగానీ లాజిక్‌ల గురించి అడగొద్దని చెప్పుకొచ్చారు. సినిమాల్లోని పాత్రలు, వారి ప్రవర్తన గురించి లాజిక్‌ల గురించి అడిగి దర్శకులను ఇబ్బంది పెట్టవద్దని, లాజిక్ గురించి ఆలోచిస్తూ పోతే ఏ దర్శకుడు దర్శకత్వ బాధ్యతలకు న్యాయం చేయలేడని చెప్పుకొచ్చారు.

ఉదాహరణగా 'యమలీల' చిత్రం గురించి వివరిస్తూ....ఈ చిత్రంలో చిత్రగుప్త(బ్రహ్మీ) పొరపాటున దేవ రహస్యం ఉన్న బుక్‌ను భూలోకంలో జార విరుస్తాడు. దీంతో ఇంద్రుడు వారికి పనిష్మెంట్ ఇవ్వడంతో ఆ పుస్తకం కోసం భూలోకానికి వచ్చి కష్టాలు పడుతుంటారు. ఈ చిత్రంలో బుక్ ఎలా పడిపోతుంది అని, ఎన్నో పవర్స్ ఉన్న వాళ్లు బుక్‌ను వెనక్కి తెప్పించుకోలేరా? అని లాజిక్‌గా ఆలోచిస్తే ఆ సినిమా తీయలేం. దేవుడు చేసిన మనుషులు అలాంటిదే. ఈ చిత్రంలో కూడా ఎవరూ లాజిక్ గరించి ఆలోచించొద్దు అని స్పష్టం చేశారు.

రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటోగ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం.. రఘు కుంచే, పాటలు.. భాస్కర భట్ల, ఎడిటింగ్.. ఎస్ ఆర్ శేఖర్, కథ, స్క్రీన్ ప్లే,మాటలు, దర్సకత్వం : పూరీ జగన్నాధ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X