సునీల్‌కి నో... వెల్ కమ్! : మంచు విష్ణు ట్వీట్
హైదరాబాద్ : ప్రముఖ నటుడు మోహన్ బాబు, హీరో సునీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోందని, బాలీవుడ్ మూవీ 'వెల్ కమ్' చిత్రానికి రీమేక్ గా ఈచిత్రం రూపొందనుందని, 'లక్ష్యం' చిత్రం ఫేమ్ శ్రీవాసు ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారని...ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతున్న ప్రచారాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం.
తాజాగా ఈ ప్రచారంపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు స్పందించారు. శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్ బాబు నటిస్తున్న విషయాన్ని దృవీకరించారు. ఈ చిత్రాన్ని తానే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్ పై తానే నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు. అయితే ఇందులో సునీల్ నటిస్తున్న వార్తలను మాత్రం విష్ణు ఖండించారు.
ఈ విషయమై విష్ణు తన ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. 'మా నాన్న(మోహన్ బాబు) xyzతో కలిసి నటిస్తున్నట్లు వస్తున్న రూమర్లను నమ్మవద్దు. నాన్న తర్వాత సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈచిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు' అంటూ విష్ణు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరో వైపు మోహన్ బాబు ప్రధాన పాత్రలో విష్ణు 'రావణ బ్రహ్మ' అనే సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన మంచు విష్ణు ప్రస్తుతం ఏ చిత్రంలోనూ నటించడం లేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన వివాదాల నేపథ్యంలో కోర్టుల చుట్టు తిరుగుతున్నాడు ఈ హీరో.


Click it and Unblock the Notifications











