మెగా హీరో సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? స్పందించిన నిర్మాతలు!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి 'ఉప్పెన' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో హీరో మత్స్యకారయువకుడిగా కనిపిస్తారని, సముద్రం నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది.

ప్రముఖ తమిళ నటుడు, వైవిధ్యమైన పాత్రలతో సౌత్‌లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి సేతుపతి తప్పుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
'డియర్ కామ్రేడ్' మూవీ ప్రెస్ మీట్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు చెందిన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ... ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆగస్టు 16 నుంచి జరిగే షూటింగులో విజయ్ సేతుపతి జాయిన్ జాయిన్ అవుతున్నట్లు వెల్లడించారు.
సాంకేతిక నిపుణులు
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సి.ఇ.ఒ: చెర్రీ
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మోనిక రామకృష్ణ


Click it and Unblock the Notifications











