ప్లీజ్ నన్నలా పిలవద్దు...స్నేహా ఉల్లాల్
ఉల్లాసంగా...ఉత్సాహంగా చిత్రంలో ధనలక్ష్మిగా కనిపించి అలరించిన స్నేహా ఉల్లాల్ కి జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పేరు. మీడియావారు కూడా ఆమెను జూనియర్ ఐష్ అని రాస్తూంటారు. దానికి ఆమె మండిపడుతోంది. నాకంటూ ఏమీ గుర్తింపు లేదా అంటోంది. నన్ను నా పేరుతోనే పిలవండి...పేరుకు ముందు అలాంటివి రాయొద్దు అని పనిగట్టుకుని చెప్తోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలమైనా ఇంకా అలాగే అనిపించుకోవాలంటే అదోలా ఉంటోందని బ్రతిమాలుతోంది. అందులోనూ ఆమె కెరీర్ కూడా ఆశించినంత వేగంగా ముందుకు వెళ్ళటం లేదు. బాలయ్యతో సింహా చేసినా, సుశాంత్ తో కరెంట్ చేసినా ఆమె బిజీ కాలేకపోయింది. ప్రస్తుతం ఆమె తమిళం వేదం వెర్షన్ లో చేస్తోంది. తెలుగులో అలా మొదలైందిలోనూ, కన్నడంలో దేవి అనే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











