twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫైర్ అన్నా ఓకే.... ఆ మాట మాత్రం అనొద్దంటున్న సాయి పల్లవి!

    తనను మలయాళీ అమ్మాయి అని పిలవొద్దని, తాను తమిళ అమ్మాయిని అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు.తనను మలయాళీ అమ్మాయిగా పేర్కొంటూ మీడియాలో వార్తలు రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్ం చేశారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఎఫైర్ అన్నా ఓకే.... ఆ మాట మాత్రం అనొద్దు ప్లీజ్..

    మలయాళం మూవీ 'ప్రేమమ్' సినిమా హీరోయిన్‌గా సాయి పల్లవి గుర్తింపు తెచ్చి పెట్టింది. తెలుగులో 'ఫిదా' తర్వాత ఆమె మరింత ఫేమస్ అయింది. అటు మళయాల చిత్ర సీమ, ఇటు తెలుగు చిత్ర సీమ అమ్మడుకి కెరీర్ తొలినాళ్లలోనే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

    'ప్రేమమ్' సినిమాతో వెలుగులోకి వచ్చింది కాబట్టి చాలా మంది ఆమెను మలయాళీ బ్యూటీ అనుకుంటారు. కానీ సాయి పల్లవి తమిళ అమ్మాయి. 'ప్రేమమ', 'ఫిదా' సినిమాల ఎఫెక్టుతో ఇపుడు తన మాతృభాష అయిన తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయి.

    ఆవార్తలను పట్టించుకోని సాయి పల్లవి

    ఆవార్తలను పట్టించుకోని సాయి పల్లవి

    ఇటీవల ఆమె ఓ తమిళ హీరోతో చాలా క్లోజ్ గా ఉంటోందని, అడితో లవ్ ఎఫైర్ రన్ చేస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలను సాయి పల్లవి అసలు పట్టించుకోలేదు. అయితే మీడియాలో తన గురించి వచ్చిన ఓ వార్త చూసి ఆమె ఆగ్రహానికి గురయ్యారు.

    తనను అలా పిలవొద్దంటోంది

    తనను అలా పిలవొద్దంటోంది

    ఇటీవల ఓ పత్రికలో సాయి పల్లవిని మలయాళీ బ్యూటీ అని సంబోధిస్తూ వార్త రాశారు. దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ..... తాను మలయాళీ అమ్మాయిని కాదని, తమిళ అమ్మాయినే అని, తనను అలాగే ట్రీట్ చేయాలని అంటోంది.

    తమిళంలో అవకాశాలు

    తమిళంలో అవకాశాలు

    సాయి పల్లవికి ఇప్పుడిప్పుడే తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. ధనుష్ హీరోగా తెరకెక్కిన మారి (తెలుగులో మాస్‌) చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ఇపుడు 'మారి 2' చిత్రం తెరకెక్కుతోంది. మారి -2 చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు నిర్మాణ సంస్థ వూండ‌ర్‌బార్ ఫిల్మ్స్ వెల్ల‌డించింది.

    తెలుగులో ఎంసీఏ

    తెలుగులో ఎంసీఏ

    నాని హీరోగా హీరోగా తెలుగులో ఎంసీఏ -మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నానికి జంట‌గా ఇటీవ‌ల ఫిదాతో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

    English summary
    "Don't call me Malayali girl, call me Tamil girl" Sai Pallavi Suggested to the media. Sai Pallavi was born in Kotagiri, Tamil Nadu to Senthamarai Kannan and Radha. She has a younger sister, Pooja Kannan, who has also worked as an actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X