ఆమెది బూతు...నాది ఆర్ట్ : సన్నీ లియోన్‌పై బిపాసా!
ముంబై : బ్లూ ఫిలిం హీరోయిన్ సన్నీలియోన్‌తో పోల్చడంపై బాలీవుడ్ బ్లాక్‌బ్యూటీ బిపాషా బసు కస్సు బుస్సు మంటోంది. ఆమెతో నన్ను పోల్చడం ఏమిటి బూతు సినిమాలకు రొమాంటిక్ సినిమాలకు తేడా లేదా? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. బిపాసా ప్రస్తుతం విక్రమ్‌భట్ దర్శకత్వం వహిస్తున్న 'రాజ్ 3' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఆ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ పై బిపాసా ఫోజులు హాట‌్ హాట్ గా మత్తెక్కిస్తున్నాయి.
దీంతో 'జిస్మ్ 2' చిత్రంలో సన్నీలియోన్‌ను మించి 'రాజ్ 3'లో బిప్స్ తన అందాలను ప్రదర్శిస్తోందనే వార్త బిపాషా స్పందిస్తూ 'సినిమా థీమ్‌కు అనుగుణంగా ప్రచార చిత్రానికి ఆ రకమైన భంగిమలో పోజ్ ఇచ్చాను. అందులో తప్పేముంది?. పబ్లిసిటీ స్టిల్స్ చూసే సినిమా కథాంశమేమిటో ప్రేక్షకులకు తెలియాలి. అయినా నా అందాల ప్రదర్శనలో కళాత్మకత కనిపిస్తుంది. అశ్లీలత వుండదు. ఆ తేడా తెలుసుకోవాలి. దయచేసి నన్ను పోర్న్‌స్టార్స్‌తో పోల్చొద్దు' అని చెప్పింది బిపాషా.
ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. బిపాసాతో పాటు ఇషా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర పాత్రలు పోషించారు. జీత్ గంగూలీ, రషీద్, మిథున్ సంగీతం అందించారు. మహేష్ భట్ నిర్మాత. ఇక సన్నీ లియోన్ నటించిన 'జిస్మ్ 2' ఆగస్టు 3న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











