»   » పోర్న్ స్టార్‌ను కాదు, సన్నీ లియోన్‌తో పోల్చద్దు

పోర్న్ స్టార్‌ను కాదు, సన్నీ లియోన్‌తో పోల్చద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తనను సన్నీ లియోన్‌తో పోల్చడంపై బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మండిపడింది. ఆమెలా తాను పోర్న్ ఇండస్ట్రీ నుండి రాలేదని, పోర్న్ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. పోలిస్తే గీలిస్తే నను మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్ లతో పోల్చండి...నేను కూడా వారిలా డాన్స్, నటన, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

ఓ వీడియో ఆల్భం షూటింగ్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెపైకి మీడియా వారు పలు ప్రశ్నలు సంధించారు. ఈ వీడియో ఆల్బమ్ సన్నీ లియోన్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. ఈప్రశ్నకు చిర్రెత్తి పోయిన రాఖీ సావంత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

 Rakhi Sawant

‘దయచేసి నన్ను సన్నీ లియోన్‌తో పోల్చవద్దు. నేను డాన్సింగ్, నటన, రియాల్టీ షో ద్వారా ఈ స్థాయికి చేరుకున్నాను. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాను. అంతే కానీ అడల్ట్ ఫిల్మ్స్‌లో నటించడం లేదా ఇంకేదైనా చేయలేదు. మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను' అన్నారు.

‘నేను చాలా గ్లామరస్...చాలా పై స్థాయిలో ఉన్నాను. మీరు నన్ను జెన్నిఫర్ లోపెజ్, మడోన్నా లాంటి వారితో కంపేర్ చేస్తే నేనేమీ ఫీల్ కాను' అంటూ మీడియా ప్రతినిధులకు ఝలక్ ఇచ్చింది రాఖీ సావంత్. నిజంగానే రాఖీ సావంత్ వాళ్లతో పోల్చదగ్గ పాపులర్ పర్సనాలిటీయేనా?

English summary
Rakhi Sawant detests any comparison with the adult film star-turned-Bollywood actress Sunny Leone and says she should instead be compared to the likes of international icons Jennifer Lopez and Madonna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu