బిఅలర్ట్ : ఫ్యాన్స్‌ను నట్టేట ముంచుతున్న జూ ఎన్టీఆర్ సాంగ్!
పాయింటులోకి వెళితే....
ఈ సాంగుకు ఆన్ లైన్లో ఎక్కువ ఆదరణ ఉందనే విషయం గమనించిన సైబర్ నేరగాళ్లు....జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకర్షిస్తూ వారిని ఆన్ లైన్ దోపిడీ చేస్తున్నారు. పాపులర్ సాంగ్ అనే వెబ్ సైట్ ద్వారా చర్యకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ వెబ్ సైట్ మంచిదే అయినా ఇందులో ప్రమాదకర వెబ్ లింకులు పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
దీనికి సంబంధించిన సర్వర్ కెనడాలో ఉన్నట్లు తెలుస్తోంది. పాపులర్ సాంగ్ వెబ్ సైట్లో సాంగు చూడటానికి గానీ, డౌన్ లోడ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే వేరే లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలైన ఈమెయిల్ అడ్రస్, తదితర వివరాలు అడుగుతారు. ఇచ్చారో అంతే సంగతులు. మీ ఈ మెయిల్ ట్రేస్ చేసి మీ బ్యాంకు అకౌంట్ కు సంబంధించిన వివరాలు రాబట్టి.....ఆన్ లైన్లోనే మీ అకౌంట్ లోని డబ్బును ఖాళీ చేస్తారు.
గతంలో బాడీగార్డ్ సాంగ్ డౌన్ లోడ్ చేసుకున్న వారు కూడా ఇదే విధంగా దోపిడీకి గురయ్యారు. ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ 'symantec' ఈ విషయాలను వెల్లడించింది. అందుకే ఇంటర్నెట్లో విహరించే ముందుకు కాస్త అలర్ట్ గా ఉండండి. మీ ఈమెయిల్ అడ్రస్, వ్యక్తిగత వివరాలు ఇచ్చే ముందుకు ముందు వెనక ఆలోచించండి.


Click it and Unblock the Notifications












