బాస్ ఆఫ్ కామసూత్ర: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి
కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జనాన్ల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంటే... వివాదాస్పద నటి శ్రీరెడ్డి మాత్రం ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. మరోసారి ఆమె సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే శ్రీరెడ్డి తీరుపై కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. దేశం మొత్తం ఒకలొల్లి... నీదొక లొల్లి, ఏ సమయంలో ఎలాంటి విషయాలు ప్రస్తావించాలి అనేది తెలియదా? అంటూ ఫైర్ అవుతున్నారు. తనను విమర్శిస్తున్న వారికి శ్రీరెడ్డి కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

టెర్రరిస్టులతో పాటు ఈ చీడ పురుగులను ఫినిష్ చేయాలి
కేవలం పాకిస్థాన్ టెర్రరిస్టులు మాత్రమే కాదు.. దేశంలోని కొందరు చీడపరుగులు కూడా చాలా ప్రమాదకారులు. టెర్రరిస్టులతో పాటు వారిని కూడా ఫినిష్ చేయాలని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పూలందేవి ప్రస్తావన తెస్తూ ఒకప్పుడు ఆమె సమాజంలోని చీడపురుగులను ఏరిపారేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అలా చేయొద్దు
కొందరిపై ఒత్తిడి.. కొందరికి ఆనందం.. నేను కేవలం ఒత్తిడినే చూస్తాను. ఎవరూ ఎవరిపై ఒత్తిడి చేయకూడదు. అది బిజినెస్ అయినా, వ్యక్తిగతం అయినా.... అంటూ శ్రీరెడ్డి ఓ సెక్సువల్ పిక్ షేర్ చేశారు.

శ్రీరెడ్డి పోస్టుపై అభ్యంతరం
అయితే శ్రీరెడ్డి షేర్ చేసిన ఫోటోపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీ నుంచి ఇలాంటి పోస్టులు ఆశించలేదని కొందరు.. కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేసిన నువ్వు ఇలాంటి ఎందుకు చేస్తున్నావంటూ మరికొందరు విమర్శించారు.

బాస్ ఆఫ్ కామసూత్ర: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి
అప్పట్లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ... సోషల్ మీడియాలో హడావుడి చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఇపుడు మళ్లీ ఆరోపణల పర్వం మొదలు పెట్టిన ఆమె కొరటాల శివను టార్గెట్ చేశారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











