»   » తాతయ్య బయోపిక్‌లో నటించను: జూ ఎన్టీఆర్

తాతయ్య బయోపిక్‌లో నటించను: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేస్తుండగా.... మరో వైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను వివాదాస్పద కోణంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.

ఎన్టీఆర్ బయోపిక్ మీద రెండు సినిమాలు వస్తుండటంపై యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ పై సినిమా తీసే స్వేచ్ఛ అంద‌రికీ ఉంద‌ని జూ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తాతటగారి జీవితం ఎందరికో ఆదర్శం అన్నారు.

నేను నటించను

నేను నటించను

తాతయ్య జీవిత కథతో వచ్చే సినిమాలో తాను నటించడానికి సిద్ధంగా లేనని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. అంత ధైర్యం త‌న‌కు లేద‌ని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి

ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి

ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లార‌ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడని జూ ఎన్టీఆర్ అన్నారు. అలా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తిగా మారారని... తారక్ వ్యాఖ్యానించారు.

ఎవరూ ఆపలేరు

ఎవరూ ఆపలేరు

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా, వారిని మరొకరు ఆపగలరని తాను అనుకోవడం లేదని జూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మీద వివాదాస్పద మూవీ: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ ఇదే

ఎన్టీఆర్ మీద వివాదాస్పద మూవీ: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ ఇదే

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
A biopic on the thespian is on the offing. Filmmaker Ram Gopal Varma has already announced a film on the former Andhra Pradesh Chief Minister. Asked if he would star in the biopic on his grandfather, Jr NTR told IANS, “I don’t have the courage. It’s not that I can’t do it but I just don’t want to attempt”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu