శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్... బాలీవుడ్లో మరో అందాల సంచలనం!

By Bojja Kumar

Recommended Video

బాలీవుడ్ గ్లామర్ సెన్సేషన్ ! | Filmibeat Telugu

హీరోయిన్ శ్రీదేవి ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో శ్రీదేవి అప్పట్లో తిరుగులేదు. అటు అందం పరంగా, ఇటు అభినయం పరంగా ఆమె ఓ సెన్సేషన్.

ఇపుడు శ్రీదేవి వారసత్వంలో ఆమె కూతురు జాహ్నవి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. 'ధడక్' అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

 ఇన్ స్టాగ్రామ్‌లో జాహ్నవి సంచలనం

ఇన్ స్టాగ్రామ్‌లో జాహ్నవి సంచలనం

తన తొలి సినిమా ‘ధడక్' లాంచ్ అయ్యే వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ ప్రొఫైల్ మెయింటేన్ చేసిన జాహ్నవి కపూర్.... ఇపుడు తన ప్రొఫైల్ పబ్లిక్ గా మార్చేసింది. అందులో తన హాట్ ఫోటోలతో పాటు చిన్ననాటి ఫోటోలు పోస్టూ అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

వావ్ ఎంత అందంగా ఉందో...

వావ్ ఎంత అందంగా ఉందో...

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫోటో చూసిన పలువురు సినీ అభిమానులు జాహ్నవి భవిష్యత్తులో బాలీవుడ్లో అందాల సెన్సేషన్ కావడం ఖాయం అంటున్నారు.

 తండ్రితో కలిసి చిన్నతనంలో

తండ్రితో కలిసి చిన్నతనంలో

తండ్రి బోనీ కపూర్‌తో కలిసి చిన్నతనంలో జాహ్నవి కపూర్. తన చిన్న నాటి జ్ఞాపకాలను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. జాహ్నవి కపూర్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

 కూతురు హీరోయిన్ అవుతోంది, తండ్రి ఆనందం

కూతురు హీరోయిన్ అవుతోంది, తండ్రి ఆనందం

నిర్మాతగా బోనీ కపూర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. ఇపుడు తన కూతురు నటిగా వెండితెరకు పరిచయం అవుతుండటం చూసి ఒక తండ్రి ఆనంద పడుతున్న బోనీ కపూర్.

 ట్రెడిషనల్ లుక్‌లో జాహ్నవి కపూర్ అదుర్స్

ట్రెడిషనల్ లుక్‌లో జాహ్నవి కపూర్ అదుర్స్

మెడ్రన్ డ్రెస్సులో మాత్రమే కాదు.... ట్రెడిషన్ దుస్తుల్లో కూడా జాహ్నవి ఎంతో అందంగా ఉందని, ఆమె బాలీవుడ్ ఫ్యూచర్ సెన్సేషన్ కావడం ఖాయం అంటున్నారు శ్రీదేవి అభిమానులు.

 నటన పరంగా కూడా

నటన పరంగా కూడా

తల్లి నుండి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న జాహ్నవి కపూర్.... వివిధ హావభావాలు ప్రదర్శిస్తూ ఓ ఫోటోను పోస్టు చేశారు. కేవలం అందం పరంగానే కాదు, నటన పరంగా కూడా తల్లి పేరు నిలబెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

 పార్టీలు, పబ్బులు

పార్టీలు, పబ్బులు

ఈ తరం సినిమాల్లో పార్టీ కల్చర్, పబ్ కల్చర్ చూపించడం సర్వసాధారణం. అందులో నటించే వారికి కూడా ఆ పార్టీ కల్చర్స్ తెలిసి ఉండాలి. అందుకే జాహ్నవి తరచూ ముంబైలో స్నేహితులతో కలిసి పార్టీలు, పబ్బులకు వెలుతూ ఉంటుంది.

 ధడక్ సినిమా గురించి

ధడక్ సినిమా గురించి

‘ధడక్' సినిమా విషయానికొస్తే.... ఈ చిత్రం ద్వారా జాహ్నవి కపూర్‌తో పాటు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాత. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి ఇది రీమేక్. జులై 6, 2018లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X