అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని తప్పుబట్టిన హీరోయిన్

By Bojja Kumar

ముంబై: దేశంలో ప్రస్తుతం అధికారంలో ప్రభుత్వ హయాంలో మత అసహనం పెరిగిపోతోందంటూ కొందరు రచయితలు, సినీ ప్రముఖులు తమ అవార్డులు వెనక్కి ఇవ్వడం, మరికొందరు ఈ పరిణామాలను వ్యతిరేకిస్తుండటం..... దేశంలో ఇపుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు.

‘అవార్డులు వెనక్కి ఇవ్వడం ద్వారా సమస్య(అసహనం)ను పరిష్కారించలేం. అందుకు గల కారణాలను విశ్లేషించాలి. వాటిని నిర్మూలించే ప్రయత్నాలు చేయాలి. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదు. ఇది దేశానికి సంబంధించిన సమస్య. దీన్ని పరిష్కరించడానికి ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. అవార్డులు వెనక్కి ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు' అన్నారు.

Don’t return awards: Kareena Kapoor

‘నేను ఏ అవార్డు తిరిగి ఇవ్వలేదు. కానీ దేశంలో ఎక్కడికి వెళ్లినా, వివిధ సమస్యలపై యువత చేస్తున్న ప్రతీకార పోరాట నన్ను ఎంతగానో ఇన్ స్పైర్ చేస్తోంది' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు. ఏ సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి, పోరాడాలి అని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు.

రాయ్ పూర్ లో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన కరీనా కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అసహనం పెరిగిపోతోందంటూ అవార్డులు వెనక్కి ఇవ్వడంపై కరీనా కపూర్ ను ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X