»   » దయచేసి ఇలాంటి చెత్తకు నన్ను ట్యాగ్ చేయవద్దు: హీరో నాని ఆగ్రహం

దయచేసి ఇలాంటి చెత్తకు నన్ను ట్యాగ్ చేయవద్దు: హీరో నాని ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నాని... ఇండస్ట్రీలో చాలా సిన్సియర్ యాక్టర్. క్లాప్ బాయ్ స్థాయి నుండి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి అనుకోకుండా నటన వైపు వచ్చి హీరోగా టర్న్ అవ్వడమే కాకుండా నటన పరంగా తన టాలెంట్ నిరూపించుకుని టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళుతున్నాడు. సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదుగుతున్న నాని.... తన కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా నెగెటివ్ వార్తలు వస్తే వెంటనే వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

Trivikram Planning Movie With Nani
 నాని గురించి చెత్త రాసిన మీడియా సంస్థ

నాని గురించి చెత్త రాసిన మీడియా సంస్థ

తాజాగా ఓ మీడియా సంస్థ నాని గురించి చెత్త న్యూస్ రాసింది. అంతే కాకుండా ఆ వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేసి నానిని ట్యాగ్ చేశారు. దీంతో నాని కాస్త ఫీలయ్యారు. సున్నితంగా మందలించే ప్రయత్నం చేశారు.

 ఏం రాశారు?

ఏం రాశారు?

నానికి యాక్షన్ సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని, యాక్షన్ ఇమేజ్ కోసం వెంపర్లాడుతున్నాడని, తన సినిమా కథల్లో యాక్షన్ సన్నివేశాలు ఉండేలా మార్పులు చేర్పులు చేయమని డైరెక్టర్లను కోరుతున్నాడని ఆ కథనం సారాంశం.

 వెంటనే రియాక్ట్ అయిన నాని

వెంటనే రియాక్ట్ అయిన నాని

తన గురించి నాన్‌సెన్స్ న్యూస్ రాసి తన అకౌంట్‌కు ట్యాగ్ చేయడంతో అది వెంటనే నాని దృష్టిలో పడింది. దీనిపై సాఫ్ట్‌గా రియాక్ట్ అయ్యాడు. తాను చాలా గౌరవంతో చెబుతున్నానని చెబుతూనే అలాంటి వార్తలపై తన మనసులో ఉన్న ఆక్రోశాన్ని బయట పెట్టారు.

 ఇలాంటి చెత్తకు నన్ను ట్యాగ్ చేయవద్దు

ఇలాంటి చెత్తకు నన్ను ట్యాగ్ చేయవద్దు

ఇలాంటి నాన్సెన్స్ రాసినప్పుడు, తనను ట్యాగ్ చేయకుండా ఉండాలని, ఇది నా విన్నపం అంటూ నాని రిక్వెస్ట్ చేశాడు. నాని ట్వీట్లో బాధ, నిజం ఉందని..దయచేసి మా హీరో గురించి ఇలాంటి చెత్త రాయవద్దని నాని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 నాని తాజా మూవీ

నాని తాజా మూవీ

ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లు. త్వరలోనే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
"With all due respect, at least don't tag me when u write such nonsense news about me.. humble request.. thank you" said hero Nani to media house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu