'ఊసరవిల్లి' రూమర్స్ పై నిర్మాత ఖండన

By Srikanya

మహేష్ బాబు దూకుడు చిత్రం ఓ ప్రభంజనంలా మార్కెట్లో ఊపేస్తూండటంతో ఈ ఎఫెక్టు ఊసరవిల్లి కలెక్షన్స్ పడతాయని, రిలీజ్ డేట్ మారుస్తారంటూ వార్తలు వినపడుతున్నాయి.వాటిని రూమర్స్ అంటూ నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ ఖండించారు...ఆయన మాటల్లో...మీరు ఆ రూమర్స్ నమ్మద్దు..మేం ముందు ప్రకటించినట్లుగానే అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలియపరిచారు. అలాగే షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యిందని అన్నారు. ఎన్టీఆర్,తమన్నా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందుతున్న చిత్రం ఊసరవిల్లి . ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లి మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X