»   » రాజమౌళి కొడుకు ఎగ్జైట్మెంట్, అఖిల్ అక్కినేని ఫీలయ్యాడు!

రాజమౌళి కొడుకు ఎగ్జైట్మెంట్, అఖిల్ అక్కినేని ఫీలయ్యాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వారిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. సినిమా రంగంలో సీనియర్స్ అయితే ఇవి వారికి అలవాటైపోతాయి. పెద్దగా పట్టించుకోరు. అయితే ఇప్పుడిప్పుడే సినిమా రంగంలోకి అడుగు పెడుతున్న అఖిల్ అక్కినేని లాంటి వారు మాత్రం ఈ రూమర్స్ విని హర్టవుతున్నారు.

తాజాగా తన రెండో సినిమా విషయంలో మీడియాలో వినిపిస్తున్న పుకార్లపై అఖిల్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వంశీ పైడిపల్లికి అఖిల్ హ్యాండిచ్చాడు. రెండో సినిమా అతడితో చేయడం లేదనే వార్తలు విని అఖిల్ హర్టయినట్లున్నాడు.

Also Read: ఆ స్వేచ్ఛ నాకు లేదు: అఖిల్ అక్కినేని

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ మీద కూడా రూమర్స్ రాజ్యమేలుతున్నాయి. కార్తికేయ త్వరలో దర్శకత్వంలోకి అడుగు పెడుతున్నాడని, ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్నాడని, త్వరలోనే రాజమౌళి తన కొడుకు రాసిన కథను ఎన్టీఆర్ కి వినిపించి, ఒప్పించి ఆ సినిమా ద్వారా కార్తికేయను దర్శకుడిగా పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ టీవీ ఛానల్ ప్రచారం చేసింది.

దీనిపై ఎస్.ఎస్.కార్తికేయ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'కొన్ని రూమర్స్ మనకు ఎగ్జైట్మెంట్ ' కలిగిస్తాయి అంటూ ట్వీట్ చేసాడు. దీనికి అఖిల్ స్పందిస్తూ... 'హ..హ.. బ్రదర్ నీ విషయంలో కనీసం ఎగ్జైట్మెంట్ కలిగించే రూమర్స్ అయినా వస్తున్నాయి. నా విషయంలో నాన్సెన్స్ రూమర్స్ వస్తున్నాయి' అంటూ ట్వీట్ చేసాడు.

వంశీ పైడిపల్లితో తనకు మంచి రిలేషన్ ఉంది, ఇద్దరి కలిసి ప్రస్తుతం కథకు సంబంథించిన చర్చలు జరుపుతున్నాం. మీరు ఈ విషయంలో లేని పోని రూమర్స్ రాయవద్దు. ప్రింట్ మీడియా, ఆన్ లైన్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకంటూ ఓ మేనేజర్, పిఆర్ టీమ్ ఉంది. ఏదైనా విషయంలో డౌట్ ఉంటే వారిని సంప్రదించి క్లారిఫై చేసుకోండి. అంతే కాని అసత్యాలు రాయవద్దు. తన రెండో సినిమా గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేయలేదన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని అప్పటి వరకు అసత్యాలు రాయోద్దని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు అఖిల్.

స్లైడ్ షోలో అఖిల్ ట్వీట్లు...

కార్తికేయ ట్వీటుకు అఖిల్ రిప్లై

కార్తికేయ ట్వీటుకు అఖిల్ రిప్లై

హ..హ.. బ్రదర్ నీ విషయంలో కనీసం ఎగ్జైట్మెంట్ కలిగించే రూమర్స్ అయినా వస్తున్నాయి. నా విషయంలో నాన్సెన్స్ రూమర్స్ వస్తున్నాయి

నాకంటూ పిఆర్ టీం ఉంది

నాకంటూ పిఆర్ టీం ఉంది

నాకంటూ ఓ మేనేజర్, పిఆర్ టీమ్ ఉంది. ఏదైనా విషయంలో డౌట్ ఉంటే వారిని సంప్రదించి క్లారిఫై చేసుకోండి. అంతే కాని అసత్యాలు రాయవద్దు అఖిల్ ట్వీట్.

వంశీ గురించి

వంశీ గురించి

వంశీ పైడిపల్లితో తనకు మంచి రిలేషన్ ఉంది, ఇద్దరి కలిసి ప్రస్తుతం కథకు సంబంథించిన చర్చలు జరుపుతున్నాం. మీరు ఈ విషయంలో లేని పోని రూమర్స్ రాయవద్దు.

రెండో సినిమాపై

రెండో సినిమాపై

నా రెండో సినిమా గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేయలేదన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని అప్పటి వరకు అసత్యాలు రాయోద్దని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు అఖిల్.

English summary
"My dear friends from the print and online media. I have a manager and a PR team. Please feel free to call or meet whenever you'd like. But writing false info without confirming is not only damaging but also hurts your credibility. Vamshi and I are very much working together. I had never made an announcement about any film officially. I will announce my film as soon as I feel I have found the right subject.Thank u" Akhil Akkineni tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu