టాప్ స్టార్స్ తో మంచు లక్ష్మి డాన్స్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : మల్టి స్టారర్ మూవిస్, స్టార్ అంతా కలిసి అవార్డ్ పంక్షన్ లలో ఒకే వేదికపై కనపడటం వంటివి కామనే. కానీ స్టార్స్ చాలా మంది ఒకే పాటలో కనపడటం మాత్రం మనకు తక్కువే. బాలీవుడ్ లో ఉన్న ఈ కల్చర్ మనకు ఎందుకనో దూరంగానే ఉండిపోయింది. తెరపై కొద్ది క్షణాలు పాటు కనపడే ఓ పాటలో స్టెప్స్ కోసం వీరందరనీ కలిసి,డేట్స్ మాట్లాడుకుని, ఒప్పించుకోవటం ఇబ్బందికరమని ప్రయత్నించరు.

అయితే మంచు లక్ష్మి అలాంటి అరుదైన సాహసమే చేసింది. ఆమె తన పరిచయాలతో టాప్ స్టార్స్ ని అందరినీ తెచ్చుకుని తన తాజా చిత్రం కోసం బ్రేక్ అప్ అంటూ ఓ పాట చేసేసింది. ఆ పాట టీజర్ ఇక్కడ చూడండి. ఏ స్టార్స్ ఈ పాటలో కనపడుతున్నారో చూసి ఎంజాయ్ చేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ పాటలో తాప్సీ, నాగార్జున, సుశాంత్, నవదీప్, అడవి శేష్, నాని, రానా, రవితేజ, సుమంత్, మంచు మనోజ్, శింబు కనపించారు. ఈ పాట ఇఫ్పటికే ఈ చిత్రానికి చాలా పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ పాట...వైరల్ లాగ దూసుకుపోతోంది. పార్టీ మూడ్ లో నడిచే ఈ పాట సినిమాలోనూ హైలెట్ గా ఉంటుందని భావిస్తున్నారు.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

Dongaata Movie Break-up Antu Song Trailer

లక్ష్మి మంచు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుండి ఇదివరకు వచ్చిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ‘గుండెల్లో గోదారి' సినిమాలకు భిన్నంగా ‘దొంగాట' వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో ఓ ప్రత్యేక సందర్భంలో నాగార్జున, రవితేజ, రానా, నాని, శింబు, సుధీర్‌బాబు, నవదీప్‌, సుశాంత్‌, తాప్సీ పలువురు కనిపిస్తారు. ఓ కీలక సన్నివేశం కోసం వారిని అడగ్గానే ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ చక్కని కథ చెప్పాడు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు.'' అన్నారు.

వంశీకృష్ణ మాట్లాడుతూ ‘‘మాటల సందర్భంలో లక్ష్మికి కథ చెప్పాను. వెంటనే చేసేద్దాం అంది. కామెడీ నేపథ్యంలో ఇదొక కొత్త సినిమా అవుతుంది'' అని అన్నారు. ‘‘తొలిసారి కామెడీ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఇదొక కొత్త అనుభూతి. ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ అవుతుంది'' అని అడివి శేష్‌ తెలిపారు.

‘గుండెల్లో గోదారి' లాంటి ఫీల్ గుడ్ మూవీ తర్వాత మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తాను నిర్మిస్తున్న సినిమా ఇదని లక్ష్మీ మంచు తెలిపారు. అన్నీ అనుకూలిస్తే... ఏప్రిల్ 16న సినిమాను విడుదల చేస్తామని మంచు లక్ష్మి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X