హాట్ షాట్స్ టైప్ లో కామెడీట...

ఈ సందర్భంగా నిర్మాత నాయుడు మాట్లాడుతూ సతీష్ ఏదైతే తమకు చెప్పాడో అంతకన్నా అద్బుతం గా చిత్రాన్ని తెరకెక్కించారనీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్నామని అక్టోబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి తగిన సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. నరేష్ మాట్లాడుతూ ఇది ఒక డిఫరెంట్ సినిమా అనీ మొదటి నుండీ చివరి దాకా నవ్వులే నవ్వులనీ, తాను చేసిన పలు చిత్రాలకు మాటల రచయితగా చేసిన సతీష్ తో తనకు చక్కని అనుభందం వుందనీ ఇప్పుడు దర్శకుడి గా కూడా సతీష్ చక్కని ప్రతిభ కనబరిచారనీ ఈ చిత్రం లో విజువల్ కామెడీ చాలా ఎక్కువగా వుంటుందనీ తప్పకుండా ఇది అందరినీ అలరించే చిత్రం అవుతుందనీ అన్నారు.
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ఇరవై నాలుగు మంది కమేడియన్స్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో హాట్ షాట్స్ టైప్ లో ఒక చక్కని కామెడీనీ ప్రేక్షకులకు అందిస్తున్నాని అనుకొంటున్నాను అని అన్నారు. సంగీత దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఇది వరకు మొదటి సినిమా అనే చిత్రానికి సంగీతాన్ని అందించానని ఇప్పుడు ఈ చిత్రానికి కూడా చక్కని మెలోడీలను అందించాననీ అన్నారు. ఈ చిత్రం లో ఇంకా ఆలీ, బ్రమ్మానందం, వేణుమాధవ్, రావు రమేష్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











